సమంత మీరు ఎప్పుడు ‘దేవత’ అవుతారు?

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్బవతి అనే విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని విరుష్క కపుల్ బేబీ బంప్ ఫొటో షేర్ చేసి మరీ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా అనుష్క తన బేబీ బంప్ ను దాచాలనుకోవడం లేదు. రెగ్యులర్ గా తన బేబీ బంప్ తో ఫొటో షూట్ చేయించుకుని ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో బేబీ బంప్ తో అనుష్క శర్మ కనిపించింది.

ఆ ఫొటోకు అనుష్క అభిమానులు మాత్రమే కాకుండా పలువురు స్టార్స్ కూడా స్పందించారు. ఆమె ఆరోగ్యం విషయంలో శ్రద్దలు చెబుతూ చాలా అందంగా ఉన్నారు అంటూ ఆమెను అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత కూడా అనుష్క ఫొటో కు స్పందించింది. ఇన్ స్టా గ్రామ్ లో సమంత ‘దేవత’ అంటూ అనుష్క శర్మ బేబీ బంప్ ఫొటోకు కామెంట్ పెట్టింది. సమంతకు బేబీ బంప్ తో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ సూట్ లో అనుష్క దేవత మాదిరిగా కనిపించిందట.

సమంత స్పోర్టివ్ గా చేసిన ఆ కామెంట్ ను అందరు అభినందిస్తున్నారు. ఇదే సమయంలో మిమ్ములను మేము ఎప్పుడు ‘దేవత’గా చూస్తాం అంటూ ప్రశ్నిస్తున్నారు. సమంత మీరు ఎప్పుడు దేవత అవుతారు అంటూ పలువురు ఆమెను సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. అంటే మీరు ఎప్పుడు తల్లి అవుతారు అనేది వారి అభిప్రాయం. మరి సమంత.. చైతూ దంపతులు ఎప్పుడు తల్లిదండ్రులు అవుతారో చూడాలి.