డాటర్స్ తో మెగాస్టార్ వారెవ్వా

0

మెగాస్టార్ చిరంజీవి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి తెలిసిందే. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా వీలున్నప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు ఆయన ఎంతో ఆసక్తిని చూపిస్తారు. ఇక కూతుళ్లు అంటే చిరుకి ఎనలేని ప్రేమ. పండగలు పబ్బాలు వస్తే ఇంటిల్లిపాదీ సరదాగా ఓచోట సందడి చేస్తుంటారు. ఇక పండగ ఏదైనా ఆడపడుచుల సంబరం అంతా ఇంతా కాదు.

తాజాగా చిరంజీవి కొణిదెల ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో సుశ్మిత .. శ్రీజ.. నిహారిక సహా ఇతర సిస్టర్స్ ఎంతో జోష్ తో కనిపిస్తున్నారు. చిరంజీవి స్మైలిస్తూ వారితో కలిసి ఫోటో దిగడం ఇంట్రెస్టింగ్. ఇది త్రోబ్యాక్ ఫోటోనే అయినా కన్నుల పండుగగా ఉండడంతో నెటిజనుల్లో స్పీడ్ గా వైరల్ అవుతోంది.

ఇక ఐదారు నెలల క్వారంటైన్ సమయంలో చిరుకి ఇలాంటి అవకాశాలెన్నో కలిగాయి. ఫ్యామిలీ ఈవెంట్లకు సంబంధించిన ఫోటోల్ని ఆయన స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణ కోసం చిరు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరో రెండు నెలలు వాయిదా పడిందన్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే తన కుటుంబీకులతో మరో రెండు నెలల సమయం ఇలానే చిరు సందడిగా గడిపేస్తారేమో!