హాలీవుడ్ కోసమేనా అమ్మడి తిప్పలు?

0

ముంబై టు లాస్ ఏంజెల్స్ ప్రయాణంతో బాగా అలసిపోయిందట మోడల్ కం నటి సౌందర్య శర్మ. ఆరు నెలలకు పైగా అమెరికాలో గడిపిన సౌందర్య శర్మ తిరిగి భారతదేశానికి వచ్చేసింది. ఈ పర్యటనలో అమ్మడు నటనకు సంబంధించిన కోర్సులు చేసిందట. అయితే యుఎస్ వెళ్లి మహమ్మారి కారణంగా అక్కడే చిక్కుకుంది. సమస్యలు కష్టాలు ఉన్నా.. లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు తాను చాలా నేర్చుకున్నానని సౌందర్య చెప్పారు.

“నేను వంట చేస్తున్నాను. హైకింగ్ చేస్తున్నాను. LA అంతటా తెరిచి ఉంది. కిరాణా సామాగ్రి కొనడానికి ఉదయం 6 గంటలకు మేల్కొన్నాను. ఇది చాలా సాధనలా అనిపించింది. నేను ఇప్పుడు అన్ని నేర్చుకున్న మంచి అమ్మాయిని“ చెప్పింది. నటశిక్షణ కోర్సులేనా అంటే.. హాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోందట. హాలీవుడ్ మూవీ ఆడిషన్ కోసం కూడా లాస్ ఏంజెల్స్ వెళ్లిందట. అయితే కోవిడ్ 19 తీవ్రంగానే ఇబ్బంది పెట్టిందని తెలిపింది.

సౌందర్య ముంబైకి తిరిగి వచ్చేసి రెండ్రోజులైంది. దిల్లీలో ఉన్న తన కుటుంబాన్ని ఇంకా కలవలేకపోయిందట. అందరినీ చాలా కోల్పోతున్నాను. ఇకపై నా ప్రాజెక్టులలో పని చేయడం ప్రారంభిస్తాను.. కాబట్టి నేను ఎప్పుడు వెళ్లి వారిని కలవగలనో కూడా తెలీదు. ఈ దీపావళిని మాత్రం ఇంట్లో గడపాలని నిర్ణయించుకున్నా“ అని చెప్పింది.

భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు సౌందర్య మూడు రోజుల పాటు గాలి బబుల్ విమానంలో ప్రయాణించింది. విమానంలో ఏమీ తినలేదు. తినాలంటే నాకు చాలా అనుమానం ఉన్నందున నీళ్లు మాత్రమే తాగి బయటపడ్డాను అని చెప్పింది. నేను ఇలాంటిదాన్ని ఎదుర్కొంటానని ఊహించలేదని చెప్పింది. నేను ఏప్రిల్ లో తిరిగి వచ్చి నా వెబ్ సిరీస్ కోసం షూటింగ్ ప్రారంభించాల్సి ఉంటుంది అని చాలా సంగతులే చెప్పింది. అన్నట్టు విమానాశ్రయం నుంచి తిరిగొచ్చేస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన టూపీస్ డ్రెస్ చూపరుల మతి చెడగొడుతోంది. అందరి చూపులు తనవైపే. అమెరికాలో రకరకాల ప్లేసులకు వెళ్లినప్పటి ఫోటోల్ని షేర్ చేసింది ఈ భామ. వీటికి స్పందన అద్భుతంగా ఉంది.