Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్లతో మహానటికి టెన్షనే

ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్లతో మహానటికి టెన్షనే


అందాల కథానాయిక కీర్తి సురేష్ ఇటీవల టాలీవుడ్ కి దూరమైన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన తర్వాత నాయికా ప్రధాన చిత్రాలపై దృష్టి సారించిన కీర్తి అటు హిందీ పరిశ్రమలోనూ ఓ చిత్రానికి సంతకం చేసింది. ఈ బ్యూటీ ప్రస్తుత సన్నివేశం పరిశీలిస్తే కీర్తి బ్యాక్ టు బ్యాక్ సూపర్ స్టార్లతో పని చేయనుంది. కీర్తి సురేష్ డిసెంబర్ – జనవరిలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో షూటింగ్ ప్రారంభించి బిజీ కానున్నారు.

వచ్చే నెలలో తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన తమిళ-తెలుగు ద్విభాషా చిత్రీకరణను వచ్చే వారం ప్రారంభించనున్నారు. రజనీ హైదరాబాద్ వచ్చి `అన్నాతే` సుదీర్ఘ షెడ్యూల్ ని పూర్తి చేయనున్నారు. డిసెంబర్- జనవరి నెలల్లో ఈ చిత్రానికి కాల్షీట్లు ఇవ్వగలిగేలా ఇతర కమిట్ మెంట్లను షెడ్యూల్ చేయాల్సిందిగా మేకర్స్ కీర్తి సురేష్ ను కోరారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార- మీనా లాంటి అగ్ర నాయికలు నటిస్తున్నారు.

వచ్చే నెలలో సూపర్ స్టార్ మహేష్ `సర్కారు వారి పాట` రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుండగా… కీర్తి జాయిన్ కావాల్సి ఉంటుంది. ఒకేసారి ఇరువురు సూపర్ స్టార్లకు తేదీలు కేటాయించడం కీర్తికి కాస్త టన్షనేనని చెప్పాలి. ప్రతిదీ ప్రాధాన్యతా క్రమంలో పక్కాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.