దుబాయ్ బుర్జ్ ఖలీఫాని షేకాడించే అరబ్ కిలాడీ

0

దుబాయ్ ని బుర్జ్ ఖలీఫాని షేకాడించే అరబ్ కిలాడీ గా మెరుపులు మెరిపించింది కియరా అద్వాణీ. లేటెస్టుగా లక్ష్మీ బాంబ్ వీడియో సాంగ్ లో కియరా అరబ్ దేశపు రాణిలా అదరగొట్టింది. అక్షయ్ కుమార్ – కియారా అద్వానీ జంట రొమాన్స్ పీక్స్ అనే చెప్పాలి. బుర్జ్ ఖలీఫా పేరుతో మ్యూజిక్ వీడియోలో దుబాయ్ లో ఈ హాట్ పెయిర్ శృంగార రసం పరాకాష్టలో చూపించారు కొరియోగ్రాఫర్లు. ఇందులో కొన్ని సరదా మూవ్ మెంట్స్ రక్తి కట్టించాయి.

ఈ పాట 1990 .. 2000 లలో అక్షయ్ చిత్రాల రేంజును అభిమానులకు గుర్తు చేస్తుందన్న కితాబు దక్కింది. అక్కీ ఆ రేంజులోనే స్టెప్పులేశాడు. ఇక కియారా బంగారు వర్ణం డిజైనర్ డ్రెస్ లో రెడ్ డిజైనర్ డ్రెస్ లో తళుకుబెళుకులు ప్రదర్శించిన తీరు… ముఖాభినయం హీట్ పెంచింది. బుర్జ్ ఖలీఫాను శశి పాడారు. ఆయనే స్వరపరిచారు. నిజేతా గాంధీతో డిజె ఖుషి మహిళా గాత్రాలను ఇచ్చారు. గగన్ అహుజా ఈ పాట కు సాహిత్యాన్ని ఇచ్చారు.

ఈ పాట కోసం దుబాయ్లోని భగభగ మండే ఎడారి ఇసుకపై తాను చెప్పులు లేకుండా నృత్యం చేశానని కియారా వెల్లడించింది. షూట్ నుండి వివరాలను పంచుకుంటూ.. 28 ఏళ్ల ఈ భామ తాను పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చింది. “బుర్జ్ ఖలీఫా కోసం షూటింగ్ అత్యంత ఆనందించే షెడ్యూళ్లలో ఒకటి. ఫాన్సీ దుస్తులతో పాటు ఫ్యాన్సీయర్ లొకేషన్లు అదరగొట్టాయి. మంచులో చిఫాన్ చీరలు ధరించడం కష్టమని మేము అనుకుంటే ఇక్కడ కాలిపోతున్న ఎండలో కాలిపోతున్న ఎడారి ఇసుక మీద చెప్పుల్లేకుండానే నృత్యం చేయాల్సొచ్చింది“ అంటూ కియార చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా వీడియో సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. కియరా అందాల్ని ఓ రేంజులోనే ఎలివేట్ చేయడంతో యూత్ లోవైరల్ గా మారింది.