వర్మ దయతో సెటిలయ్యిన ముద్దుగుమ్మలు

0

రామ్ గోపాల్ వర్మ శిష్యులు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉంటారు. ప్రముఖ దర్శకులు పలువురు ఆయన శిష్యులు అనడంలో సందేహం లేదు. ఆయన వద్ద ఒక్క సినిమాకు పని చేయాలని టెక్నీషియన్ మరియు నటీనటులు కోరుకునే వారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆయన చేస్తున్న ప్రతి ఒక్క సినిమా ఏదో ఒక వివాదం నేపథ్యంలో కొనసాగుతుంది. అందుకే ఆయనతో సినిమా అంటే ఏరి కోరి వివాదాన్ని కొని తెచ్చుకోవడమే అని కొత్త వారు తప్ప పాత వారు ఆసక్తి చూపడం లేదు. ఈమద్య కాలంలో ఈయన శ్రీ రాపాక మరియు అప్సర రాణి అనే ఇద్దరు మద్దుగుమ్మలను తీసుకు వచ్చాడు. వీరిద్దరు కూడా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యింది. కాని సరైన అవకాశాలు రాక లైమ్ లైట్ లోకి రాలేక పోయారు.

వర్మ ఎప్పుడైతే ఎన్ఎన్ఎన్ అంటూ శ్రీరాపాకతో సినిమాను తీశాడో అప్పుడే ఆమె కెరీర్ టర్న్ అయ్యింది. ఆమెకు ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. అలాగే సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. అప్సర రాణి.. ఈ అమ్మడిని థ్రిల్లర్ సినిమాలో నటింపజేసి ప్రస్తుతం డేంజరస్ సినిమాలో కూడా నటింపజేస్తున్నాడు. వర్మ ఇచ్చిన ఆఫర్లతో పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు ఇటీవల రవితేజ క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఆ సినిమా సక్సెస్ అయితే అప్సర ఐటెం సాంగ్ లతో సెట్ అయ్యి ఆ తర్వాత హీరోఇయన్ గా కూడా టర్న్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.