Templates by BIGtheme NET
Home >> Cinema News >> కియరా రెడ్ హాట్ లుక్ వైరల్

కియరా రెడ్ హాట్ లుక్ వైరల్


కెరీర్ ప్రారంభించిన ఐదేళ్లలోనే 2 కోట్లు పైగా పారితోషికం అందుకునే కథానాయికగా ఎదిగేసింది కియరా అద్వాణీ. ఇటు సౌత్ అటు బాలీవుడ్ రెండు చోట్లా ఈ అమ్మడి హవా కి ఎదురే లేదు. అన్నిచోట్లా స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ .. షాహిద్ కపూర్ .. సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లతో ఆఫర్లు అందుకున్న ఈ భామ ఇటు టాలీవుడ్ లో అగ్ర కథానాయకులు మహేష్ .. రామ్ చరణ్ సరసన అవకాశాలు అందుకుంది. తదుపరి బన్ని ఎన్టీఆర్ లాంటి స్టార్ల సరసన ఆఫర్ పరిశీలనలో ఉంది.

మరోసారి రామ్ చరణ్ సరసన నటించనుందన్న కథనాలు ఇటీవల హైలైట్ అయ్యాయి. చరణ్ సరసన ఆచార్యలో కియరా నటించనుందని ఇటీవల కథనాలొచ్చాయి. ఆ తర్వాత తని ఒరువన్ సీక్వెల్ లోనూ కియరా కి ఛాన్సుంటుందని గుసగుసలు వినిపించాయి.

ఇక ఈ స్పీడ్ లోనే కియరా రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా రెడ్ హాట్ బికినీలో కిల్లర్ లుక్ తో చెలరేగిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోని యువతరం వైరల్ గా షేర్ చేస్తున్నారు. ఆ కళ్లలోనే బోలెడంత మత్తు. గమ్మత్తయిన చూపులతో గాలం వేస్తోందిలా.