Templates by BIGtheme NET
Home >> Cinema News >> హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకున్న కన్నడ స్టార్ హీరో..?

హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకున్న కన్నడ స్టార్ హీరో..?


కన్నడ స్టార్ హీరోలలో ‘కిచ్చ’ సుదీప్ ఒకరు. విభిన్నమైన చిత్రాలు.. విలక్షణమైన పాత్రలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక తాను నటించే సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఇక్కడ కూడా ఆదరణ దక్కించుకున్నాడు. రాజమౌళి సృష్టించిన ‘ఈగ’ సినిమాలో సుదీప్ విలన్ గా నటించి అలరించాడు. అలానే ‘బాహుబలి’ ‘రక్త చరిత్ర 2’ వంటి సినిమాలలో కనిపించాడు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన పాన్ ఇండియా మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ లో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. సుదీప్ హీరోగా నటించిన ‘పైల్వాన్’ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇలా టాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుదీప్.. ఇప్పుడు హైదరబాద్ లో ఖరీదైన ఓ ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో సుదీప్ ప్లాట్ తీసుకున్నారట. ప్రస్తుతం తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తుండటం.. తాను నటించే కన్నడ సినిమాల షూటింగ్స్ ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే జరుగుతుండటంతో అన్నిటికి అనువుగా ఉండేలా ఇక్కడ నివాసం ఏర్పరచుకోవాలని సుదీప్ భావించాడట. అందుకే సుమారు 5 కోట్ల రూపాయలు వెచ్చించి గచ్చిబౌలి ల్ ప్లాట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సుదీప్ లేటెస్ట్ మూవీ ‘ఫాంతమ్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 వీకెండ్ ఎపిసోడ్ కి గెస్ట్ గా హాజరయ్యాడు. కన్నడ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుదీప్.. తెలుగు బిగ్ బాస్ హోస్ట్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున తో కలిసి అలరించాడు. నాగ్ తో కలిసి ఉన్న ఫోటోని సుదీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడ