బోయ్ ఫ్రెండ్ తో పూల్ సైడ్ చిక్కిందిలా

0

`తీన్ మార్` బ్యూటీ కృతి కర్భంద గుర్తుంది కదూ.. సుమంత్ సరసన బోణి అనే చిత్రంలోనూ నటించింది. కానీ అవేవీ తనకు ఎంతమాత్రం కలిసి రాక టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది. తిరిగి బాలీవుడ్ లోనే తనవైపు వచ్చే అవకాశాల్ని ఒడిసిపట్టుకుంది. ఇంతకుముందు హౌస్ ఫుల్ 4 లాంటి క్రేజీ మూవీలో నటించింది. అక్షయ్-పూజ.. తుషార్-కృతి సనోన్ .. బాబీ డియోల్- కృతి కర్బంద జంటల మధ్య పునర్జన్మల కథ తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శల పాలైనా కాసులు బాగానే కురిపించింది.

కృతిలో స్పైసీ యాంగిల్ ఆకట్టుకుంది. ఇకపోతే ఇటీవలి కాలంలో ఈ అమ్మడి పేరు అంతగా వినిపించలేదు. ఉన్నట్టుండి ఇదిగో ఇలా పూల్ సైడ్ రెడ్ బికినీతో నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈత కొలను వద్ద పుల్కిత్ సామ్రాట్ తో పాటు కనిపించింది. నాలుగైదు నెలలుగా లాక్ డౌన్ విధించినప్పటి నుండి కృతి అతనితోనే ఎక్కువగా కనిపిస్తోంది.

“ఆజ్ బ్లూ హై పానీ… పానీ“ అంటూ ఈ ఫోటోని షేర్ చేసింది పుల్కిత్ నే. ఇక ఆ ఇద్దరి స్నేహం గురించి ఇటీవల గుసగుసలు వినిపించాయి. పుల్కిత్ ని సల్మాన్ భాయ్ హీరోగా పరిచయం చేయగా.. ఆరంభం రోహిరాతో అతడు డేటింగ్ చేశాడు. ఇటీవల ఆమెకు బ్రేకప్ చెప్పి ఇలా కృతితో లాక్ అయిపోయాడన్న గుసగుసలు వినిపించాయి. మరోవైపు కృతి కెరీర్ పరంగా ఎదిగేందుకు ప్రణాళికల్లో ఉంది. `వాన్` అనే తమిళ చిత్రం సహా హిందీలో `థైస్`.. `14 పెరే` అనే రెండు చిత్రాలతో బిజీగా ఉంది.