డ్రగ్స్ దర్యాప్తు ఇంతకీ తాప్సీ ఆవేదన ఏమిటంటే..!

0

మీటూ ఉద్యమం తర్వాత కథానాయికల మధ్య స్నేహ సంబంధాలు బలపడ్డాయనడానికి అలాగే మహిళా యునైటీ కూడా బలపడిందనడానికి ఇటీవల డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి దర్యాప్తులో ఎదురైన సంఘటనలే ఎగ్జాంపుల్. రియా చక్రవర్తి మాదక ద్రవ్యాలను సేవించడం.. సరఫరా చేయడం వగైరా కేసుల్లో ఇరుక్కున్నా బాలీవుడ్ లో తన సన్నిహితులు సహా పలువురు నాయికలు బహిరంగ మద్థతును పొందగలిగింది. ఈ కేసులో తనని బలిపశువును చేస్తున్నారన్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారన్న వాదన వినిపించారు. కరీనా.. లక్ష్మీ మంచు.. తాప్సీ పన్ను వీళ్లంతా తనని బలిపశువును చేస్తున్నారనే కోణంలో మీడియా వైఖరిని ఖండించే ప్రయత్నమే చేశారు. ఇంకా ఎవరు దోషి ఎవరు నిర్ధోషి అన్నది తేలక ముందే రియాను దోషిగా డిక్లేర్ చేసేస్తారా? అన్న ఆవేదనను వ్యక్తం చేశారు.

తాజాగా తాప్సీ పన్ను మీడియాపై గరంగరంగా స్పందించింది. సహనాన్ని కోల్పోయిన తాప్సీ మీడియా ఇలా అండర్ ట్రయల్ చేయడం ఏం బాలేదని సీరియస్ అయ్యింది. అసలింతకీ మీడియా నిజంగా ఏం కోరుకుంటోంది? అసలు అపరాధికి శిక్ష పడాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భంలో నేను ఎప్పుడూ చెప్పినట్లుగానే ఆమె(రియా) ఎవరో నాకు తెలియకపోయినా.. పరస్పరం కలవకపోయినా తనకు మద్ధతుగానే నిలుస్తాను అని ధైర్యంగా ముందుకొచ్చింది తాప్సీ. సున్నితమైన విచారణలో ఇప్పటికే రియాపై తీర్పు ఇచ్చేస్తున్నారు అందరూ.

ఏదైనా తప్పు చేస్తే నిందించేందుకు చాలా ముందుంటారు. అన్నిచోట్లా జరుగుతున్నవే ఇవి అయినా.. కానీ రియాపై మీడియా ట్రయల్ .. కొన్ని చోట్ల శారీరక వేధింపుల విధానం చాలా షాక్ ని ఇచ్చింది. అందుకే తన గురించి మాట్లాడాల్సి వచ్చిందని తాప్సీ తెలిపింది.