Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ కేసులో రియాకు లాయర్ ఉచిత సేవలు..!?

సుశాంత్ కేసులో రియాకు లాయర్ ఉచిత సేవలు..!?


సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో ట్విస్టులు మలుపుల గురించి తెలిసిందే. తాజాగా ఈ కేసులో రియా చక్రవర్తి లాయర్ సతీష్ మనేషిందే పేరు హైలైట్ అవ్వడం చర్చకు వచ్చింది. ఆయన రియాకు ఉచిత సేవలందిస్తున్నారనేది నెటిజనుల అభియోగం.

అయితే అదంతా ఉత్తుత్తే.. అంటూ.. న్యాయవాది సతీష్ మనేషిందే ఖండించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని .. నా క్లైయింట్ ఫీజు ఇస్తుందా లేదా? అన్నది మా వ్యక్తిగతం అని అన్నారు. అలాగే ఈ కేసులో తన తరపున వాదించేందుకు నేనుగా తనని సంప్రదించాననేది కూడా అబద్ధం అని అన్నారు.

ఈరోజు సుశాంత్ కేసు విషయమై రియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పిలిపించడంతో లాయర్ కూడా స్పందించాల్సి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ బృందం ఇంకా విచారణ సాగిస్తోంది. అలాగే తన క్లయింట్ అయిన రియాను డిపెండ్ చేస్తూ.. ఇప్పటివరకు తనపై ఎటువంటి నేరారోపణలు లేవని అన్నారు.

రియా (28) మాదకద్రవ్యాలను తీసుకునేదని.. తన ప్రియుడు సుశాంత్కు నిషేధిత పదార్థాలను కాఫీలో కలిపి ఇచ్చేదనే మీడియా వాదనల్ని ఆయన ఖండించారు. రియా తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. ఆమె రక్త పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉంది. రియాపై అనవసర ప్రచారం సాగుతోంది!! అని లాయర్ సతీష్ మాన్ సిండే వ్యాఖ్యానించారు. ముంబై పోలీస్.. బిహార్ పోలీస్.. తర్వాత ఈడీ.. ఇప్పుడు సీబీఐ విచారిస్తున్నారు. ఇంతమంది అవసరమా? అంటూ అతడు వ్యంగ్యంగా సెటైర్ వేసే ప్రయత్నం చేశారు.