హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య కి జోడీగా అందాల ముద్దుగుమ్మ..!

0

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఇటీవలే హోమ్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.4 ప్రాజెక్ట్స్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘అలా ఎలా’ ‘లవర్’ చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ తెరకెక్కించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో మిగతా లీడ్ యాక్టర్స్ ని ఫైనలైజ్ చేస్తున్న మేకర్స్ తాజాగా ఈ చిత్రంలో శౌర్య కి జోడీగా నటించే హీరోయిన్ ని ప్రకటించారు. ఇందులో షిర్లీ సెటియా ని హీరోయిన్ గా ఎంపిక చేశారు.

షిర్లీ సెటియా హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆక్లాండ్ కి చెందిన ఈ బ్యూటీ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకుంది. ‘మస్కా’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన షిర్లీ.. ప్రస్తుతం ‘నికమ్మ’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈ క్రమంలో నాగశౌర్య సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి బుజ్జి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ‘ఛలో’ సినిమాకు సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శౌర్య కెరీర్లో 22వ చిత్రంగా రానున్న ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.