నిశబ్దంలో మాధవన్ పాత్ర ట్విస్ట్ హైలైట్

0

అనుష్క హీరోయిన్ గా మాధవన్.. అంజలి.. షాలిని పాండేలు కీలక పాత్రలో నటించిన ‘నిశబ్దం’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యం అవ్వడంతో చివరకు ఓటీటీలో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కనుక ఓటీటీలో విడుదల చేస్తున్నాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ సినిమాపై మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అనుష్క మూగ చెవిటి అమ్మాయి. ఆమె ఒక కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా తెలుస్తోంది. ఆ కేసు ఏంటీ అనుష్క ఎలా ఆ కేసును ఛేదిస్తుంది అనేది కథాంశంగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది.

మాధవన్ కీలక పాత్రలో కనిపిస్తున్నప్పటికి సినిమాలో ఆయన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని కథ మద్యలో అతడి పాత్ర గురించి ఒక విషయం రివీల్ అయ్యి సినిమా పూర్తి టర్న్ తీసుకుంటుంది. కథలోని ఆ ట్విస్ట్ టర్న్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఆ ట్విస్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కథలోని ట్విస్ట్ ఏంటీ అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలిసే అవకాశం లేదు. కనుక సినిమా చూసే ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఒక నిర్మాతగా వ్యవహరించారు.