కేసీఆర్ వరాలపై మహేష్ – రాజమౌళి ప్రశంసలు

0

తెలంగాణ సీఎం కెసిఆర్ టాలీవుడ్ కి వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. కొన్ని ముఖ్యమైన ప్రకటనలతో పరిశ్రమను ఆకట్టుకున్నారు. దాదాపు 40వేల మంది సినీ కార్మికులకు రేషన్.. హెల్త్ కార్డులు లేనివారికి ఇస్తామని అన్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు జీఎస్టీ మినహాయింపు సహా టిక్కెట్టు రేటు పెంచుకునే వెసులుబాటు .. షోలు పెంచుకునే వెసులుబాటు ఎగ్జిబిటర్లకు ఇస్తానని హామీ ఇచ్చారు. రకరకాల అంశాలపైనా పట్టు విడుపు గురించి ప్రభుత్వ సాయం గురించి ముచ్చటించి ఆకట్టుకున్నారు.

ఆయన నుండి వచ్చిన ఈ సిగ్నల్ కి పరిశ్రమ నుండి పెద్ద స్థాయిలో ప్రశంసలు దక్కాయి. చాలా మంది తారలు సిఎంకు కృతజ్ఞతలు చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే చిరంజీవి .. నాగార్జున వంటి సీనియర్ స్టార్లు కేసీఆర్ వరాలకు ఫిదా అయ్యామని ప్రకటించారు. ఈ రోజు మహేష్ బాబు- రాజమౌళి ముందుకు వచ్చి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.

సుదీర్ఘ ట్వీట్ లో మహేష్ మాట్లాడుతూ.. “టిఎఫ్ ఐకి భారీ ఎత్తు” అని పోస్ట్ చేశారు. పెద్ద తెరపై సినిమాలు చూడటం .. పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది మంది జీవితాలను నిలబెట్టడం అనే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి ప్రకటించిన అన్ని సహాయక చర్యలకు మా ప్రభుత్వానికి ధన్యవాదాలు. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ముందుకు సాగాలని ప్రోత్సహించినందుకు తెలంగాణ సీఎంవో @KTRTRS కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు.

మరోవైపు రాజమౌళి స్పందించారు. ఆయన మాట్లాడుతూ “తెలంగాణ సీఎం కెసిఆర్ గారు ప్రకటించిన చాలా అవసరమైన సహాయక చర్యలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఆనందిస్తోంది! ఇవి తప్పనిసరిగా బంతిని కోర్టులోకి తెచ్చి మళ్లీ పురోగతి మార్గంలో పయనించే ఛాన్సిస్తాయి. మీకు ధన్యవాదాలు సార్..@ తెలంగాణ సిఎంఓ“ అంటూ సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానించారు.