షాకింగ్ వీడియో: చిరు గుండు వెనక సీక్రెట్ ఇదే

0

మెగాస్టార్ చిరంజీవి సడెన్ గా గుండుతో ప్రత్యక్షమై షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బాల్డ్ లుక్ అంతర్జాలాన్ని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు ఇది ఊహించనిది. ఇంతకుముందు రజనీకాంత్ `శివాజీ` మూవీ కోసం ఈ తరహా లో బాల్డ్ లుక్ లో ప్రయోగం చేశారు. కమల్ హాసన్ పలు చిత్రాల్లో ట్రై చేశారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా సంథింగ్ స్పెషల్ గా ట్రై చేస్తున్నారా? అంటూ మాట్లాడుకున్నారు.

చిరు ఎంతో ధైర్యంగా ఈ స్టెప్ తీసుకున్నందుకు అభినందించారు. కెరీర్ పరంగా ప్రయోగాలు కొత్తేమీ కాదు కానీ ఇలాంటిది మాత్రం కొత్తేనని అంతా అన్నారు. మెగాస్టార్ లుక్ మారిపోగానే `ఆచార్య` షూటింగ్ ఆగిపోయిందని ఏవో ఇబ్బందుల్లో పడిందని కథనాలు రావడం హీట్ పెంచింది. అయితే ఆ తర్వాత కొందరు విభిన్నమైన సందేహాలు కూడా వ్యక్తం చేసారు. ఇదేమైనా ఆచార్యలో ఒక పాత్రకు సంబంధించిన లుక్ అయ్యి ఉంటుందని అంచనా వేసారు.

నిజానికి ఇది జస్ట్ మేకప్ టెస్ట్. ఆ లుక్ ఎలా ఉంటుంది? అన్నది చెక్ చేశారట. అదే వీడియోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కొణిదెల బృందం పోస్ట్ చేశారు. నిజానికి చిరంజీవి గుండు చేయించుకోలేదు. ఆయన ఒరిజినల్ జుత్తు అలానే ఉండగా.. పైన ప్రోస్థటిక్స్ మేకప్ వేశారు. కొత్తొక వింత.. పాతొక రోత! ప్రతిసారీ పాతగా ఎందుకు.. ఈసారికి కొత్తగా ట్రై చేయాలన్న చిరు ఆలోచన ఇప్పటికైనా అర్థమైందా? ఈ వీడియోతో ప్రతిదీ క్లారిటీ వచ్చేసిందిగా? మొత్తానికి సీక్రెట్ అలా ఓపెన్ అయిపోయింది ఈ వీడియోతో.