ఇంత ముద్దుగుమ్మకు అంత పెద్ద సమస్యనా?

0

రవితేజ హీరోగా నటించిన మాళవిక శర్మ సౌత్ లో వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈమె రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ సినిమాల్లో నటించింది. ఆ సినిమా విడుదలకు ముందే మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. వచ్చే వేసవి వరకు ఈమె రెండు తెలుగు సినిమాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలో మాళవిక శర్మ ఒక షాకింగ్ విషయం చాలా సింపుల్ గా నవ్వుతూ చెప్పేసింది. ఆమె తనకు ఉన్న మానసిక రుగ్మత గురించి.. మానసిక అనారోగ్యం గురించి చెప్పి ఆశ్చర్యపర్చింది.

మాళవిక శర్మ క్లెప్లమేనియాక్ అనే చిత్రమైన మానసిక సమస్యతో బాధపడుతుందట. ఆ సమస్య ఉన్న వారికి చిన్న చిన్న వస్తువుల నుండి పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలని అనిపిస్తుందట. ఏదైనా కళ్ల ముందు కనిపించినప్పుడు దాన్ని ఎలాగైనా దొంగిలించాలంటూ మనసు పీడిస్తుందట. ఇది చాలా అరుదైన మానసిక సమస్య. దీన్ని చాలా మంది కలిగి ఉంటారు. కాని హీరోయిన్ కు ఇలాంటి సమస్య ఉంది అంటే మామూలు విషయం కాదు. మాళవిక శర్మ ఈ సమస్య తనకు ఉండటం వల్ల కొన్ని సార్లు ఇబ్బంది పడ్డట్లుగా కూడా చెప్తోంది. తన వెంట ఎవరైనా ఉండి తన మనసును ఎప్పటికప్పుడు డైవర్ట్ చేయడంతో పాటు నా మానసిక సమస్య నేపథ్యంలో ఎక్కువగా మాట్లాడించే ప్రయత్నం చేస్తారంటూ మాళవిక చెప్పుకొచ్చింది.