నాని ‘శ్యామ్ సింగరాయ్’ కథ ఇదేనట!

0

నాని హీరోగా రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. రాహుల్ గత సినిమా ట్యాక్సీ వాలా ఆత్మ నేపథ్యంలో సాగుతుంది. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాను కూడా రాహుల్ మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. మీడియా వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒక కాలంకు చెందిన వ్యక్తి మృతి చెంది మళ్లీ పుట్టడమే ఈ చిత్ర కథగా చెబుతున్నారు.

కోల్ కత్తాతో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఈ సినిమా రూపొందుతుంది. కోల్ కత్తా కు చెందిన వ్యక్తి పాత్రలో నాని కనిపించబోతున్నాడు. మరో పాత్ర తెలుగు వ్యక్తి. ఈ రెండు పాత్రల్లో కూడా నాని కనిపించబోతున్నాడు. రెండు విభిన్నమైన వేరియేషన్స్ ఉండే పాత్రలో నాని ఎలా నటించబోతున్నాడు అనేది చూడాలి. గత జన్మ గుర్తుకు రావడం లేదంటే గత జన్మకు సంబంధించిన ఏదైనా కార్యం పూర్తి చేయడమో నాని ఈ సినిమాలో చేస్తాడని అంటున్నారు. ఏదైనా ఇలాంటి కాన్సెప్ట్ లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కనుక కాస్త శ్రద్ద పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆసక్తికర ఎంటర్ టైనర్ గా సినిమాను రూపొందిస్తే మంచి విజయం దక్కించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.