ఆ హీరో తల్లి అడిగిన ప్రశ్నకు నోట మాటరాలేదు!

0

వెటరన్ స్టార్ హీరోయిన్ ప్రియమణి పెళ్లయినా వరుస అవకాశాలతో ముందుకెళ్తున్నారు. మూడేళ్ల కిందట ఆమె ముస్తాఫ్ రాజ్ ని పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె అటు వెబ్ సిరీస్ ల్లోనూ ఇటు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. కెరీర్ ప్రారంభంలోనే పరుత్తి వీరన్ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రియమణి. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించింది. చాలా ఏళ్లు అగ్రహీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం ప్రియమణి వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప సినిమాలో నటిస్తోంది. అలాగే రానా మూవీ విరాట పర్వం లోనూ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి కెరీర్ తొలినాళ్లలోని సంగతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో తరుణ్ ప్రియమణి మధ్య ప్రేమాయణం సాగినట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. ‘ నేను తరుణ్ 2005లో నవ వసంతం సినిమాలో నటించాం. ఆ సినిమా షూటింగ్ లోనే తరుణ్ బాగా క్లోజ్ అయ్యాడు. ఇద్దరం కలిసి బయటకు వెళ్లి డిన్నర్ లు కూడా చేసేవాళ్ళం. దీంతో మా మధ్య ఏదో నడుస్తోందని వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలో కూడా చాలామంది అనుకున్నారు. ఓ రోజు సెట్లో ఉండగా తరుణ్ తల్లి రోజారమణి అక్కడికి వచ్చారు.

తనతో మాట్లాడుతూ’ మీరు తరుణ్ ప్రేమించుకున్నట్లు తెలిసింది.. నీకు ఇష్టమైతే మా అబ్బాయిని పెళ్లి చేసుకో అని ఆమె కోరింది. తరుణ్ తల్లి సడెన్ గా అలా మాట్లాడేసరికి నేను షాక్ కు గురయ్యా. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే మా ఇద్దరి మధ్య ఉండేది స్నేహం మాత్రమేనని ఆమెకి వివరించా. అందరి మాదిరే మీరు కూడా ఆ ప్రచారాన్ని నమ్మారని తెలిపినట్లు’ ప్రియమణి ఆనాటి సంగతులను వివరించారు.