సునీల్ ఓటీటీ మనసంతా నువ్వే

0

కమెడియన్ టర్న్ హీరో సునీల్ కెరీర్ ఊగిసలాటలో ఉంది. హీరోగా సక్సెస్ కాకపోవడంతో కమెడియన్ గా సినిమాలు చేస్తున్న సునీల్ ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన మరోసారి హీరోగా మారబోతున్నాడు. మనసంత నువ్వే వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వీఎన్ ఆధిత్య దర్శకత్వంలో సునీల్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ప్రముఖ దర్శకుడు అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడు.

ఈ సినిమాను ఓటీటీ కోసం నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఓటీటీ మూవీగా రూపొందబోతున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఇప్పటికే కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందట. సునీల్ కు హీరోగా ఈ సినిమా సక్సెస్ ను తెచ్చి పెడితే మళ్లీ వెండి తెరపై ఆయన హీరోగా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అంటున్నారు. ఈమద్య కాలంలో స్టార్ లు సైతం ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సునీల్ ఎంట్రీ గురించి పెద్దగా చర్చ లేదు. అంచనాలు లేకుండా వస్తున్న సినిమా అవ్వడంతో ఖచ్చితంగా సునీల్.. వీఎన్ ఆధిత్యలు ఆకట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.