చీర.. కొప్పు స్వచ్చమైన తెలుగు మహిళ

0

మంచు లక్ష్మి తెలుగు మాట్లాడటం గురించి సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ వస్తూ ఉంటాయి. ఉత్తరాది హీరోయిన్స్ అయినా తెలుగు స్పష్టంగా బాగా మాట్లాడుతారు. కాని మంచు లక్ష్మి మాత్రం తెలుగును ఇంగ్లీష్ మాదిరిగా మరీ విభిన్నంగా మాట్లాడుతుందని విమర్శిస్తూ ఉంటారు. ఎంత మంది ఎంతలా విమర్శించిన తన తెలుగు మాట్లాడే స్టైల్ ను మార్చుకోక పోవడంతో పాటు తాను ఏది అయితే చేయాలనుకుంటుందో ఎలా అయితే ఉండాలనుకుంటుందో అలాగే ఉంటూ అలాగే చేస్తూ నలుగురికి ఇన్సిపరిరేషన్ గా మంచు లక్ష్మి ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫాలోవర్స్ తో టచ్ లో ఉండే మంచు లక్ష్మి ఈ ఫొటోను షేర్ చేసింది.

తెలుగు మహిళ అంటూ నిండైన చీర కట్టు.. జుట్టును కొప్పుగా వేసి పూలు పెట్టి ఉంటుంది. ఏమాత్రం అశ్లీలత లేకుండా చూడగానే రెండు చేతులు లేపి దండం పెట్టాలి అన్నట్లుగా రాజసం ఉట్టి పడేలా మంచు లక్ష్మి ఉంది. ఎప్పుడు ఏదో పిచ్చి డ్రస్ లు వేసే మీరు చీర కట్టు.. జుట్టు కొప్పు పూలు పెట్టుకుని ఉంటే నిండైన తెలుగు మహిళ మాదిరిగా కనిపిస్తున్నారు మేడం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఈ లుక్ తో ఏదైనా ఒక్క సినిమాలో అయినా నటిస్తే చూడాలని ఉంది అంటూ కూడా కొందరు కామెంట్ పెట్టారు. ఒక టాక్ షో నిమిత్తం మంచు లక్ష్మి ఇలా రెడీ అయ్యింది. అతి త్వరలో ఆ టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమె సినిమాలు ఈమద్య తక్కువ అయ్యాయి. ఈమె నటిగా మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తుందా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.