కొన్నేళ్ల పాటు పెళ్లి మాటే ఎత్తనన్న స్టార్ హీరోయిన్

0

మహమ్మారీ లాక్ డౌన్ కి ముందే కొన్ని సినిమాలతో బిజీ అయ్యింది శ్రుతిహాసన్. చిత్రీకరణ మిడిల్ లో ఉండగానే వైరస్ క్రైసిస్ మొదలైంది. కారణం ఏదైనా చాలా నెలల విరామం తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్ లాక్ వల్ల షూటింగులు స్టార్టయ్యాయి. దీంతో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మళ్ళీ కొన్ని ప్రాజెక్టుల షూటింగ్ ల్లో బిజీగా ఉన్నారు. క్రాక్- వకీల్ సాబ్ -లాభమ్ చిత్రాలతో శ్రుతి బిజీగా ఉంది.

శ్రుతి తాజా ఇంటర్వ్యూలో వృత్తిపరమైన వ్యక్తిగతమైన అనేక విషయాలపై బహిరంగంగా ముచ్చటించింది. కొన్ని సంవత్సరాల పాటు పెళ్లి అనే మాటే ఎత్తనని శ్రుతి తెలిపింది. తన తండ్రి కమల్ హాసన్ రాజకీయ పార్టీలో చేరి రాజకీయాలు చేస్తారా? అన్న ప్రశ్నకు… శ్రుతి సింపుల్ గా నవ్వేసింది.

తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదని.. తమిళనాడులో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో తన తండ్రి పార్టీ తరపున ప్రచారం కూడా చేయనని శ్రుతి షాకిచ్చింది. ప్రస్తుతానికి సినిమాలే లోకంగా ఈ భామ కాలం వెల్లదీయనుందిట. అన్నట్టు విదేశాల్లో పాప్ గాయనిగా ఎదగాలన్న ప్లానింగ్ ఎంతవరకూ వచ్చిందో కానీ దానిపై ఏదీ చెప్పలేదు ఎందుకనో.