ఒంటరి దీవుల్ని ఒణికిస్తున్న లేడీ ఆక్టోపస్

0

రహస్యంగా శోధించే ఆక్టోపస్ బృందంలో కి`లేడీ`లా .. జేమ్స్ బాండ్ సినిమాలో హోటల్ రూమ్ గెస్టులా .. ఏమిటో ఈ అమ్మడు. ఆ రేంజులోనే రెచ్చిపోతోంది? జెన్నిఫర్.. హ్యాలీ బెర్రీ అయినా బాబోయ్ అనేలా.. స్టన్నింగ్ లుక్ తో షాకిస్తోంది. అప్పట్లో సాహో రిలీజ్ ముందు ఈ తరహాలో బికినీ బీచ్ ట్రీట్ తో చిలౌట్ చేసింది.

కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇలా ప్రత్యక్షమైంది. బికినీకే మతి చెడేలా ఈ అమ్మడి ఫోజు చూస్తుంటే మనసు చలించకుండా ఉంటుందా? ఇంతకీ ఏదా లొకేషన్? అంటారా.. మాల్దీవుల్లో ఇలా ఆక్టోపస్ ఆపరేషన్ కి వచ్చినట్టుగా లేడీ విలన్ లాగా దిగిపోయింది. నచ్చినట్టు అక్కడ చిలౌట్ చేస్తోంది. తనే స్వయంగా ఇన్ స్టాలో ఈ ఫోటోని షేర్ చేసింది.

ప్రస్తుతం `ప్యారడైజ్ సిటీ` విహారయాత్రలో మందిర ఫుల్ బిజీ. అక్కడ నుంచి ఇలా అద్భుతమైన చిత్రాలను పోస్ట్ చేస్తోంది. కొలను కనిపించినా విడువదు.. సముద్రం కనిపించినా అస్సలు విడిచిపెట్టదు. సరోవరంలో హంసలా మారిపోతుంటుంది. సూర్య దేవుడు అయినా సిగ్గు పడేలా చెలరేగేందుకు ఏమాత్రం అడ్డు చెప్పదు. `ఏది ఉత్తమమో నిర్ణయించడం కష్టం` అన్నీ కుదిరితే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది మందిర. ఆ టోన్డ్ బికినీ బాడీని అలా వంచిన తీరు కానీ.. బ్లాక్ గ్లాసెస్ తో సూటిగా చూస్తున్న తీరుగాని కిర్రాక్ అని పొగిడేయకుండా ఉండలేరు యూత్.