సాయి పల్లవి ముందు మెగా ఛాన్స్.. కాదనే సాహసం చేస్తుందా?

0

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈమె సినిమాలను వరుసగా చేసి సంఖ్య పెంచుకున్నామా.. నాలుగు డబ్బులు వెనక వేసుకున్నామా అన్నట్లుగా కాకుండా తనకు నచ్చిన పాత్రలను నచ్చిన సినిమాలను మాత్రమే చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. పలు పెద్ద సినిమాలను హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత లేదు అంటూ వదిలేసింది. కోట్ల రూపాయల పారితోషికాలను ఆమె ఈజీగా వద్దనేసింది. అంతటి క్రేజ్ ఉన్న సాయి పల్లవి ముందు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే ఆఫర్ ఒకటి నిలిచింది. ఆ ఆఫర్ కు సాయి పల్లవి ఏం సమాధానం చెప్పబోతుంది అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

చిరంజీవి హీరోగా తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ ను రీమేక్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి మెహర్ రమేష్ దాదాపుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ఆచార్య పూర్తి అవ్వడమే ఆలస్యం రీమేక్ ను షురు చేయాలని భావిస్తున్నాడు. ఇలాంటి సమయంలో సాయి పల్లవి ని హీరోయిన్ పాత్రకు గాను సంప్రదించడం జరిగింది. చిరంజీవితో సినిమా అంటే ఒకప్పుడు చాలా అదృష్టంగా భావించేవారు. కాని ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తే యంగ్ హీరోల సరసన మళ్లీ తమను చూస్తారా అంటూ హీరోయిన్స్ అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థతి.

సాయి పల్లవి కూడా ఆ ఆలోచనతో సినిమాను కాదంటుందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు వేదాళం సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉండదు. ఇక తెలుగు రీమేక్ కు వచ్చేప్పటికి ఆ ప్రాముఖ్యత మరింత తగ్గుతుంది. కనుక తనకు ప్రాముఖ్యత లేని పాత్ర ఇస్తే సాయి పల్లవి ఒప్పుకునే అవకాశం ఉండదు. ఈ రెండు కారణాల వల్ల సాయి పల్లవి మెగా ఆఫర్ ను తిరష్కరించే అవకాశం ఉందుంటున్నారు. ఒక వేళ చిరంజీవి ఆఫర్ ను తిరష్కరిస్తే ఆ పరిణామాలు ముందు ముందు ఎలా ఉంటాయి అనేది కూడా ఆమె ఆలోచించుకోవాల్సి ఉంటుందని కొందరు సూచిస్తున్నారు.