బిగ్ బాస్ ను ఆపేంత సత్తా ఆమెకు ఉందా?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నాలుగు రోజుల క్రితం ప్రారంభం అయిన విషయం తెల్సిందే. కరోనా నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ నిర్వాహకులు షోను ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు షో కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం చాలా కామన్ అయ్యింది. మరి కొన్ని రోజుల్లో తమిళ బిగ్ బాస్ కూడా ప్రారంభం కాబోతుంది. తమిళ బిబి 4 ను అడ్డుకుని తీరుతాను అంటూ వివాదాస్పద నటి మీరా మిథున్ హెచ్చరిస్తుంది. ప్రతి సీజన్ ఆరంభంకు ముందు ఎవరో ఒకరు ఆందోళనలు చేయడం తమిళ బిగ్ బాస్ కు చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా మీరా మిథున్ బిబి4 వెంట పడుతుంది. ఆశ్చర్యకర విషయం ఏంటీ అంటే ఈమె సీజన్ 3 కంటెస్టెంట్. ఆ సమయంలో తనకు జరిగిన అవమానంకు నిరసనగా బిగ్ బాస్ ను నిలిపేయాలంటూ కోరుతున్నట్లుగా డిమాండ్ చేస్తోంది.

తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో దర్శకుడు చేరన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ మీరా ఆరోపించింది. వీకెండ్ ఎపిసోడ్ లో కమల్ హాసన్ అందుకు సంబంధించిన వీడియోలను చూపించాడు. అందులో ఎక్కడ కూడా చేరన్ అసభ్యంగా ప్రవర్తించినట్లుగా లేదు. కాని మీరా మాత్రం తన అసలు వీడియోను చూపించలేదు అంటూ విమర్శలు గుప్పించింది. తన అసలు వీడియోను చూపించకుండా తనకు ఆఫర్లు లేకుండా చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేసే వరకు బిగ్ బాస్ 4ను మొదలవ్వనివ్వను అంటోంది. మరి ఈమెకు బిగ్ బాస్ ను ఆపేంత సత్తా ఉందా అనేది చూడాలి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయ్యింది. వారిని క్వారెంటైన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.