మెగా ప్రిన్సెస్ పెళ్లి తర్వాత సినిమాలు వదిలేసినట్టేనా?

0

మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత నటిస్తుందా నటించదా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే. నిజానికి నిహారిక ఇటీవల తమిళంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటించడానికి అంగీకరించింది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రంలో నిహారిక మరింత రొమాంటిక్ గా కనిపించడానికి రెడీ అయ్యారని ప్రచారమైంది. ఈ లోగానే నచ్చిన వరుడితో పెళ్లి సెట్టయింది. ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. త్వరలోనే వెడ్డింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో నిహారిక రొమాంటిక్ ఫిల్మ్ చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

అంతా ఊహించనట్టుగానే మెగా డాటర్ తమిళ చిత్రం నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. అశోక్ సెల్వనన్ హీరోగా నటించనున్నా ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని జె. సెల్వకుమార్ నిర్మించాలకున్నారు. లాక్ డౌన్ ముందే ఈ మూవీ పట్టాలెక్కాల్సింది. కానీ కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి నిహారిక తప్పుకుందని తెలిసింది. ఈ విషయాన్ని నిర్మాత స్వయంగా వెల్లడించారు.

నిహారిక స్థానంలో `లై` ఫేమ్ మేఘా ఆకాష్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారట. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ని అక్టోబర్ నుంచి ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి స్వాతిని డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. మొత్తానికి మెగా ప్రిన్సెస్ వదులుకున్నది నితిన్ హీరోయిన్ కి చేరిందన్నమాట.