చిరంజీవి మరో అడుగు ముందుకు

0

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేప్పటి వరకు మృతుల సంఖ్యను తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా నుండి దూరంగా ఉండేందుకు ఎంతగా ప్రయత్నించినా కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. కనుక దాన్ని నివారించేందుకు కరోనాను జయించిన వారి ప్లాస్మాతో చికిత్స చేయిస్తున్నారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే ప్లాస్మాను దానం చేసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. లక్షల్లో కరోనాను జయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. కాని వందల్లో కూడా ప్లాస్మా దానంకు ముందుకు రాకపోవడం దారుణం.

ప్లాస్మా దానం గురించి అవగాహణ పెంచేందుకు స్టార్స్ ను సెలబ్రెటీలను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ప్లాస్మా దానం గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి తన వద్ద పని చేస్తూ కరోనా సోకి క్యూర్ అయిన వారిని తీసుకుని వచ్చి ప్లాస్మా ఇప్పించారు. ఈ సందర్బంగా సజ్జనార్ తో కలిసి చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. 22 ఏళ్ల క్రితం రక్తం లేక చనిపోతున్నారనే విషయం తెలుసుకుని బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా దక్కింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాస్మా అనేది చాలా కీలకం. కనుక కోవిడ్ ను జయించిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వారి ప్లాస్మాను దానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలి. ఇటీవల మా సమీప బంధువు ఒకరు కోవిడ్ తో సీరియస్ గా ఉండగా తెలిసిన వ్యక్తి ప్లాస్మా ఇప్పించాను. ఆయన ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. అలా ప్లాస్మాతో ఇతరుల ప్రాణాలు కాపాడబడుతాయి. కనుక ఎవరైతే కరోనాను జయించారో వారంతా కూడా ప్లాస్మా దానంకు ముందుకు రావాంటూ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. చిరు చేస్తున్న ఈ ప్రచారం నిజంగా అభినందనీయం అంటూ అభిమానులు సినీ వర్గాల వారు అంటున్నారు.