Templates by BIGtheme NET
Home >> Cinema News >> రజినీ నా కాళ్ళు పట్టుకున్నారు..అప్పుడు ‘ఫ్యాన్స్’ని చూడాలి!

రజినీ నా కాళ్ళు పట్టుకున్నారు..అప్పుడు ‘ఫ్యాన్స్’ని చూడాలి!


సీనియర్ యాక్ట్రెస్ శోభన.. అంటే మన తెలుగు సినీప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ 1980 90’లలో తెలుగులోని స్టార్ హీరోల అందరి సరసన నటించింది. తన నటన నాట్యంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అయితే అప్పట్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ కింగ్ నాగార్జున నటకిరీటి రాజేంద్రప్రసాద్ విక్టరీ వెంకటేష్ తదితర స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో భారీ హిట్లు అందుకుంది. ఆమె సినిమాల పరంగా ఎంత స్టార్డమ్ సాధించిందో.. నాట్యం పరంగా జీవితాన్ని అంతే ఆస్వాదించిందట. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం శోభన ఎందుకో సక్సెస్ కాలేదని చెప్పాలి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తను ఎందుకు పెళ్లి చేసుకోలేదో బయటపెట్టిన శోభన.. తాజాగా మరో ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన కాళ్ళు పట్టుకున్న సందర్భం గురించి బయట పెట్టింది. అలా అని ఎందుకో కాదు.. ఓ సినిమా సన్నివేశంలో భాగంగానే అని క్లారిటీ ఇచ్చింది.

శోభన 20వ యేటనే రజినీకాంత్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట. 1989లో అమీర్జాన్ దర్శకత్వంలో శివ అనే సినిమాలో నటించిందట. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో రజినీ ఒక సన్నివేశం విషయంలో చాలా ఆలోచనలో మునిగాడట. అయితే అదే సీన్ తన కాళ్ళు రజినీ పట్టుకోవాలి. డైరెక్టర్ నిర్మాతలకు ఆ సీన్ వద్దని నచ్చజెప్పడానికి ట్రై చేసాడట రజినీ. ఆ సీన్ చేయడానికి ఎందుకంత సందేహిస్తున్నాడని అనుకుందట. ఇక డైరెక్టర్ నిర్మాత కూడా సీన్ ఖచ్చితంగా అవసరం అనేసరికి రజినీ సీన్ చేశారట. ఆ తర్వాత సినిమా విడుదలైంది. రెండో రోజు నుండి రజినీ ఫ్యాన్స్ హీరోయిన్ని తిట్టడం మొదలు పెట్టారట. ఆ సీన్ చేయడానికి రజిని ఎందుకు సంకోచించారని అప్పుడు అర్థమైందని చెప్పింది శోభన. అది అభిమానులను దృష్టిలో ఉంచుకొని రజినీ అలా చేసారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక రజినీ సరసన శోభన మొత్తం మూడు సినిమాలు చేసింది. శివ దళపతి కొచ్చడయాన్. అయితే ప్రస్తుతం చెన్నైలో ఒంటరిగా ఉంటున్న శోభన ఓ పాపను దత్తత తీసుకుందట. ఇక ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిందని సమాచారం.