Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘డబ్బులేని మనిషిని..డబ్బులేని దేవుణ్ణి ఎవరూ కేర్ చేయరు’

‘డబ్బులేని మనిషిని..డబ్బులేని దేవుణ్ణి ఎవరూ కేర్ చేయరు’


టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన ఐడియాలజీని తనను ఫాలో అయ్యే వారితో పంచుకోడానికి పోడ్ కాస్ట్ లో అకౌంట్ ఓపెన్ చేసారు. అందులో ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో తన అనుభవాలు భావాలు ఆలోచనలు షేర్ చేసుకుంటున్నారు. పూరీ ఐడియాస్ అన్నీ ‘మనీ – సింప్లిసిటీ – ఫారెస్ట్ – స్ట్రగులింగ్ డేస్ – సేల్స్ బాయ్ – ధేడ్ దిమాక్ – బుద్ధ – రైల్వే స్టేషన్ – మదర్ – హ్యూమానిటీ – సోషల్ మీడియా – మ్యారేజ్’ ఇలా ఎపిసోడ్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పోడ్ కాస్ట్ – ఆపిల్ పోడ్ కాస్ట్ – స్ఫోటిఫై లలో అందుబాటులో ఉన్న ఈ ఆడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘మనీ’ అనే అంశంపై పోస్ట్ చేసిన ఆడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్వతహాగా పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లని పలికించే పూరీ జగన్నాథ్.. అంతే పదునైన మాటలతో డబ్బు ప్రాధాన్యతని తెలియజేస్తూ వదిలిన ఈ ఆడియో అందరిని ఆకట్టుకుంటోంది.

ఇందులో ”అన్ని మతాలు డబ్బు ముఖ్యం కాదు.. ఆత్మ పరమాత్మ ముఖ్యమని ఏవేవి కబుర్లు చెబుతాయి.. అవి నమ్మకండి. ఒక ధనవంతుడు తలచుకుంటేనే దేవుడి గుడి రెడీ అవుద్ది.. మిగతా వాళ్ళు గుడికి వచ్చి హుండీలో వేసిన డబ్బులతో గుడి రన్ అవుద్ది.. ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడు అవుతాడు.. వజ్ర వైడూర్యాలు లంకె బిందెలు ఉన్నాయని తెలిసాకే మనకి పద్మనాభస్వామి ఎవరో తెలిసింది. లేకపోతే కేరళ లోని అయన టెంపుల్ ఎవరికీ గుర్తుండదు. మనీ ని చులకనగా చూడొద్దు” అని పూరీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ”మనం పేద ప్రజలకు రెస్పెక్ట్ ఇస్తామా? ఇవ్వం కదా? కానీ అందరం డబ్బున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. డబ్బులేని వాడిని డబ్బు లేని దేవుణ్ణి మనం కేర్ చేయం. చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఇంటెలిజెంట్ పీపుల్ మనీకి రెస్పెక్ట్ ఇవ్వరు. డబ్బుదేముంది లేరా కుక్కని కొడితే వస్తాయి అంటారు.. దమ్ముంటే కోటి రూపాయలు సంపాదించి దాన్ని రోడ్డు మీద విసిరెయ్యి. నీ మాట నేను వింటాను. అందుకే టాలెంటెడ్ పీపుల్ కంటే తక్కువ టాలెంట్ ఉన్నవారి దగ్గర ఆస్తులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వారికున్న ఇన్సెక్యూర్ వల్ల డబ్బు దాచిపెట్టుకుంటారు” అని మనీ వాల్యూ తెలిపాడు. చివరగా ”అడవిలో బ్రతికితే కరెన్సీ అవసరం లేదు.. కానీ జనం మధ్య పెరగడానికి మనీ కావాలి. మనకు ఇష్టమున్న లేకపోయినా జీవితానికి సరిపడా డబ్బు సంపాదించడం ఎంతో అవసరం. అందుకే మనీకి రెస్పెక్ట్ ఇవ్వండి” అని డబ్బు అవసరాన్ని తెలియజేసాడు పూరీ.

https://www.youtube.com/watch?v=ZP8xkNPK9do