Templates by BIGtheme NET
Home >> Cinema News >> మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు.. వాడు దెబ్బ కొట్టి.. సీఎం అయ్యాడు

మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు.. వాడు దెబ్బ కొట్టి.. సీఎం అయ్యాడు


టాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి మనుషుల్లో మంచు మోహన్ బాబు ముందుంటారు. ఆయన ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా.. వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన నోరు విప్పటం.. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మంట పుట్టేలా ఉండటమే కాదు.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రస్తుత రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా ఉండటం గమనార్హం. ఏపీలో జగన్ పాలన బాగుందన్న ఆయన.. టీడీపీపై విమర్శనాస్త్రాల్ని సంధించారు.

అంతేకాదు.. గతంలో మాదిరి సినీనటులు ముఖ్యమంత్రులు అయ్యే పరిస్థితి ఇక లేదని తేల్చేశారు. సినిమావాళ్లు రాజకీయాల్లో రాణించటం అనేది ఇక వర్క్ వుట్ కాకపోవచ్చు. ఒకవేళ వారి జాతకంలో రాసి పెట్టి ఉంటే కావొచ్చేమో కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం సాధ్యం కాదన్నారు. ఇన్నేళ్ల తన సినీ.. రాజకీయ ప్రస్థానంలో తనకు అసంతృప్తి.. రాజకీయాల్లోనే ఉండిపోయిందన్నారు.

రాజకీయంగా తనను ఒకడు దెబ్బ కొట్టాడని.. ఇప్పుడు అతడి గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదన్నారు. ‘‘అప్పట్లో మేం ఇద్దరం కలిసి వ్యాపార సంస్థ కూడా పెట్టాం. అది కొట్టేసి.. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. నన్ను మోసం చేశాడు. చచ్చిన పాముని కొట్టకూడదంటారు. ఆ సామెను కొన్ని సందర్భాల్లో ఉపయోగించాలి. ఆ వ్యక్తి పేరు ఎన్నో సందర్భాల్లో చెప్పాను హిస్టరీలో దొరుకుతుంది’’ అని పేర్కొన్నారు.

తనను దెబ్బ కొట్టిన వ్యక్తి గురించి అడ్జెస్టు కావాలని కొందరు అన్నారు. అలాంటి వాళ్లను ఓరేయ్ పిచ్చ…. నా కాలికి ముల్లు గుచ్చుకుంటే బాధ నాకు తెలుస్తుంది కానీ నొప్పి ఆ మూర్ఖుడికి తెలీదు కదా?అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘వాడి దగ్గర లాభాలు పొంది.. పదవులు పొంది.. వాడ్ని కాకాపడుతూ పడుతున్నాడు. వాడి మాటలు వినాలా? నన్ను దెబ్బ కొడితే అడ్జెస్టు కావాలా? ఈ రోజు కొన్నివేల కోట్లకు అధిపతి అయ్యాడు’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు మోహన్ బాబు మాటలు సంచలనంగా మారాయి.

తిరుపతిలోని తన స్కూలుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు బకాయిల గురించి ప్రస్తావించారు. చంద్రబాబు ప్రభుత్వంలో తమకు రావాల్సిన ఫీజు బకాయిల గురించి మాట్లాడితే స్పందించలేదన్నారు. తాజాగా తన కొడుకు విష్ణు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారని.. స్కూలు బకాయిల గురించి చెప్పగా.. త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారన్నారు. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానూ.. సంచలనంగానూ మారాయి.