ప్రభాస్ సినిమా పై వీడని మిస్టరీ.. ఎవరతను..??

0

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీకోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తుండటంతో అభిమానులలో అంచనాలు ఓ రేంజ్ కి చేరుకున్నాయి. ఇక సాహో లాంటి భారీ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా లాక్ డౌన్ ముందే యూరప్ షెడ్యూల్ను ముగించుకుని పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ఇక 1960ల కాలంనాటి ప్రేమకథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రేక్షకులకు తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో..

పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ హిందీతో పాటు ఇతర బాషలలో విడుదల కానుంది. కానీ అన్నీ ఉన్నా ఏదొక లోపం ఉందన్నట్లు.. ఇంతవరకు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. మొదట్లో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది పేరు వినిపించింది. ఆ తర్వాత లెజెండ్ ఏఆర్ రెహమాన్ పేరు వినిపించింది. కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ అందలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ 20వ సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తారని ఆసక్తి ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ చిత్రబృందం మాత్రం ఈ విషయం పై నోరుమెదపట్లేదు. మరి ఎవరో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తోనే సైలెంట్ గా పనులు కానిస్తున్నారేమో.. అంటూ ఇండస్ట్రీలో అనుమానం రేకెత్తుతుంది. చూడాలి మరి అదే జరుగుతుందా..? లేక సస్పెన్సుకి తెరదించుతారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా పూజాహెగ్డే నటిస్తుంది.