Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘వైల్డ్ డాగ్’ టీమ్ కి గుడ్ బై చెప్పిన నాగ్..!

‘వైల్డ్ డాగ్’ టీమ్ కి గుడ్ బై చెప్పిన నాగ్..!


అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”వైల్డ్ డాగ్”. వాస్తవ సంఘటనలను ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ‘కింగ్’ నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నాడు. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. హిమాలయాలలోని మనాలి ప్రాంతంలో 21 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. రోహతంగ్ పాస్ లో దాదాపు 13వేల అడుగుల ఎత్తులో జీరో డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. దీంతో సినిమాలో నాగార్జున పార్ట్ షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తోంది. తాజాగా నాగార్జున ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

“వైల్డ్ డాగ్ లో నా పాత్ర చిత్రీకరణ నేటితో పూర్తయ్యింది. ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్ టీమ్ కు హిమాలయాస్ కు గుడ్ బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది” అని నాగార్జున ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్ తో కలిసి దిగిన కొన్ని ఫొటోలను నాగార్జున షేర్ చేశారు. ఈ ఫోటోలలో నాగార్జునతో పాటు బాలీవుడ్ బ్యూటీ సయామి ఖేర్ – ‘బిగ్ బాస్’ ఫేమ్ అలీ రెజా కనిపిస్తున్నారు. కాగా ‘వైల్డ్ డాగ్’ లో నాగార్జునకు జోడీగా బాలీవుడ్ భామ దియా మీర్జా నటించింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘వైల్డ్ డాగ్’ ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.