హైదరాబాద్ లో శ్రుతి జాగింగ్ హడావుడి చూశారా?

0

నవాబుల నగరం హైదరాబాద్ లో శ్రుతిహాసన్ హల్ చల్ చేసింది. ముంబై.. చెన్నయ్.. ఆ తర్వాత శ్రుతి ఎక్కువగా ఇష్టపడే నగరం హైదరాబాద్. ప్రతిసారీ సిటీకి చేరింది మొదలు వెంటనే శ్రుతి హాసన్ హైదరాబాద్ లో జాగింగ్ ని చాలా చాలా ఆస్వాధించే అలవాటు ఉందిట.

ఈసారి కూడా జాగింగ్ కి బయల్దేరిందిలా.. సాయంత్రం జాగింగ్ చేస్తున్నప్పుడు ప్లెజెంట్ గా సంగీతాన్ని ఆస్వాధిస్తూ శ్రుతి జాగింగ్ ని ప్రారంభించారు. టాప్ టు బాటమ్ శ్రుతి బ్లాక్ అండ్ బ్లాక్ లో అదరగొట్టింది. బ్లాక్ స్నీకర్స్ టోపీతో ఆల్-బ్లాక్ దుస్తులను ఎంచుకోవడానికి కారణమేమిటి? అంటే.. స్టన్నర్ లుక్ ఇదే కదా అనేస్తోంది శ్రుతి.

కెరీర్ పరంగా ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా ఫిట్ గా ఉండడం ఎలాగో శ్రుతికి బాగా తెలుసు. రెగ్యులర్ వ్యాయామానికి సహజమైన మార్గాన్ని ఎంచుకోవడమే తనకు ఇష్టం. అందుకే శ్రుతి సూపర్ హ్యాపీగా కనిపిస్తోంది.

డాడ్ కమల్ హాసన్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందే శ్రుతి తన తండ్రి కోసం ఒక కామన్ డీపీని ఆవిష్కరించింది. నా ప్రియమైన తండ్రి -కమల్ హాసన్ పుట్టినరోజు కోసం స్పెషల్ డీపీని అభిమానులే క్రియేట్ చేశారు. డీపీ చిత్రాన్ని విడుదల చేయడం నాకు దక్కిన గౌరవం“ అని శ్రుతి వ్యాఖ్యను జోడించింది.

ఇక శ్రుతి కెరీర్ సంగతి చూస్తే.. రవితేజతో క్రాక్ చిత్రంలో నటించింది. ఈ మూవీ 2021 సంక్రాంతి బరిలో విడుదలకు రానుంది. గోపీచంద్ మాలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.