పుష్కర కాలంగా ల్యాబ్ లోనే ఉన్న బ్లాక్ బస్టర్ రీమేక్ రెడీ టు రిలీజ్

0

టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచిన బొమ్మరిల్లు విడుదల అయ్యి 14 ఏళ్లు అయ్యింది. ఆ సినిమాలో సిద్దార్థ మరియు జెనీలియా జంటగా నటించారు. ప్రకాష్ రాజ్ మరియు జయసుధ కీలక పాత్రల్లో కనిపించారు. బొమ్మరిల్లు ఫాదర్ గా ప్రకాష్ రాజ్ కు మంచి గుర్తింపు దక్కింది. భారీ వసూళ్లను దక్కంచుకున్న బొమ్మరిల్లు సినిమాను తమిళంలో సంతోష్ సుబ్రమణ్యం టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. జయం రవి మరియు జెనీలియా జంటగా రీమేక్ తెరకెక్కింది. తమిళంలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక హిందీలో కూడా బొమ్మరిల్లును బోణీ కపూర్ రీమేక్ చేశాడు.

హిందీ రీమక్ లో హర్మన్ భవేజా హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించారు. షూటింగ్ దాదాపు అంతా పూర్తి అయిన ఈ రీమేక్ కు ఇట్స్ మై లైఫ్ అనే టైటిల్ ను పెట్టారు. విడుదల అనుకుంటున్న సమయంలో బోణీ కపూర్ ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో సినిమా ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయిన సినిమా పుష్కర కాలంగా ల్యాప్ లోనే ఉండి పోయింది. ఎట్టకేలకు సినిమాకు మోక్షం కలిగించేందుకు బోణీ కపూర్ అండ్ టీం సిద్దం అయ్యారు.

బోణీ కపూర్ తో పాటు మరి కొందరు చర్చించి ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే సినిమాను డైరెక్ట్ గా శాటిలైట్ ద్వారా విడుదల చేయబోతున్నారు. జీ ఎంటర్ టైన్ మెంట్ వారు ఈ సినిమాను కొనుగోలు చేశారు. ఈనెల 29న వరల్డ్ ప్రీమియర్ ను వేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే రెండు భాషల్లో సక్సెస్ అయిన ఈ సినిమా హిందీలో ఇట్స్ మై లైఫ్ గా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు.