కళ్లు తిప్పుకోనివ్వని చైసామ్ జంట

0

టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మిహీకా బజాజ్ ల వివాహం ఇటీవలే గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. పెళ్లికి ముందు నుండి పెళ్లి అయిన తర్వాత రోజు వరకు కూడా ఆ వేడుకలో అక్కినేని జంట చైతూ సామ్ లు చూడముచ్చటగా కనిపించారు. మూడు నాలుగు రోజుల పాటు చైతూ సామ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. పెళ్లి సంగీత్ వేడుక నుండి మొదలుకుని పెళ్లి రోజు తర్వాత రోజు ఇలా అన్ని రోజుల్లో కూడా సమంత సింపుల్ అండ్ స్వీట్ కాస్ట్యూమ్స్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ముఖ్యంగా సమంత మరియు చైతూ కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ జంట మరో పిక్ ట్రెండ్ అవుతోంది. అదే ఈ ఫొటో. సమంత మరియు చైతూల బ్యూటీఫుల్ స్మైల్ మరియు వారి ఛార్మింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫొటోను చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలి అన్నట్లుగా అనిపిస్తుంది. కళ్లు కూడా తిప్పుకోనివ్వకుండా ఈ అక్కినేని జంట ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రానా పెళ్లి సందర్బంగా ఈ జంట ఫ్యాన్స్ కు కన్నుల పండుగ అయ్యింది. సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న చైతూ సామ్ చాలా అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ ఫొటోలు చూస్తుంటే వారు ఎంత సంతోషంగా జీవితంను సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.