Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘నా భర్త వెనకే నేను’ అంటున్న మెగా కోడలు

‘నా భర్త వెనకే నేను’ అంటున్న మెగా కోడలు


ఆగష్టు 13న మెగా డాటర్ నిహారిక – చైతన్యల ఎంగేజ్మెంట్ వేడుక రెండు కుటుంబాల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కొణిదెల ఫ్యామిలీ మొత్తం పాల్గొనడం విశేషం. ఈ వేడుకలలో మెగాస్టార్ ఫ్యామిలీ తరపున.. అటు చైతన్య జొన్నలగడ్డ ఫ్యామిలీ తరపున అన్నీ జంటలు పాల్గొన్నాయి. అల్లు అర్జున్ – స్నేహా రాంచరణ్ – ఉపాసన కళ్యాణ్ దేవ్ – శ్రీజ ఇలా అందరూ పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఫోటో షూట్లు కూడా జరిపారట. ప్రస్తుతం నిహారిక ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మెగా ఫ్యామిలీ కార్యక్రమంలో అల్లు అర్జున్ – స్నేహ రాంచరణ్ – ఉపాసన జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక చరణ్ – ఉపాసనలు చాలా సింపుల్గా దర్శనమిచ్చారు. అయితే తన భర్తతో దిగిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే ఒక ఫోటో ప్రధానంగా ఆకర్షిస్తోంది. ఆ ఫోటోలో రాంచరణ్ మొహానికి మాస్క్ ధరించి నిలబడగా.. ఉపాసన భర్త వెనకే నిలబడి ఫోటోలకు పోజులిచ్చింది. ఇక ఈ ఫోటోకు అందమైన కాప్షన్ కూడా జోడించింది ఉపాసన. “ఇదే మేము. నా రాంచరణ్ వెనకాల ఉండటమే నాకు ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుంది” అని తెలిపింది. ఇక ఉపాసన కాప్షన్ తో నెటిజన్ల మనసు గెలుచుకుందని చెప్పాలి. వారు ఈ జంటను తెగ పొగిడేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉపాసన ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో సామాజిక అంశాల పై స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు హెల్త్ తో పాటు తన కుటుంబ విషయాలు కూడా తెలియజేస్తూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ కోడలిగా ఇంటి బాధ్యతలతో పాటు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు కూడా చూసుకుంటుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.