స్టన్నింగ్ లుక్ లో యంగ్ హీరో శౌర్య..!

0

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఇప్పటివరకు చాక్లట్ బాయ్ లవర్ బాయ్ తరహా పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల కోసం శౌర్య సరికొత్త లుక్ లోకి మారిపోయాడు. భారీ వర్కౌట్స్ చేసిన శౌర్య తన కటౌట్ ని మార్చేశాడు. వర్క్-ఎ-హోలిక్ హీరో నాగశౌర్య తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసిన పిక్ చూసి అందరూ వావ్ అంటున్నారు. ఈ ఫొటోలో కండలు తిరిగిన ఆరుపలకల దేహం కనిపించేలా అవుట్ ఫిట్స్ ధరించిన యంగ్ హీరో.. గుబురు గడ్డం తో కౌబాయ్ హ్యాట్ పెట్టుకొని కనిపిస్తునాడు. శౌర్య స్టన్నింగ్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ బాడీ కోసం నాగశౌర్య కఠోర వ్యాయామాలు చేయడంతో పాటు ఫర్ఫెక్ట్ డైట్ మైంటైన్ చేసాడని తెలుస్తోంది.

ప్రస్తుతం నాగశౌర్య ఆర్చరీ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. అతని కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు – శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. అలాగే కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు హోమ్ ప్రొడక్షన్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.