డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం 8 ప్యాక్ తో నాగశౌర్య కొత్త లుక్?

0

6 ప్యాక్ .. 8 ప్యాక్ అనేవి ఇప్పుడు కామన్ గా మారాయి. యువహీరోలంతా జిమ్ముల్లో శ్రమించి రూపాన్ని మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల నాగశౌర్య హార్డ్ వర్క్ గురించి పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడు నటిస్తున్న 20వ చిత్రం కోసం పూర్తి స్థాయిలో మేకవర్ ట్రై చేస్తున్నాడు. అందుకోసం జిమ్ముల్లో గంటల కొద్దీ సమయం వెచ్చిస్తున్నాడు.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా సినిమాని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడట. ఈ మూవీలో 6 ప్యాక్ లేదా 8 ప్యాక్ బాడీతో కనిపించేందుకు చాలానే శ్రమిస్తున్నాడని తాజాగా రివీలైన ఫోటో చెబుతోంది. జిమ్ వర్కవుట్లు అంటే ఆహార నియమాల్ని కఠినంగా పాటించాల్సి ఉంటుంది. ఏ విషయంలోనూ అతడు తగ్గడం లేదట. ఎనీ టైమ్ షూటింగుకి రెడీ అవ్వాల్సిన ప్రస్తుత తరుణంలో ఖాళీ సమయాన్ని అస్సలు వృథా చేయడం లేదు.

ఇక లుక్ వైజ్ కూడా నాగశౌర్య చాలా మార్పులు చూపించబోతున్నాడు. స్పోర్ట్స్ మన్ తరహాలో పోనీ టైల్ .. గుబురు గడ్డంతో ఈ మూవీలో కనిపించనున్నాడు. శౌర్య ఈ చిత్రంలో విలుకాడిగా నటిస్తారా? అని చూడాలి. లాక్ డౌన్ సమయాన్ని మాత్రం అతడు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడని తాజా ఫోటో చూస్తే అర్థమవుతోంది.