Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ ఇన్సిడెంట్ తర్వాత అన్నయ్య నెంబర్ వన్ హీరో అవుతానని ఛాలెంజ్ చేశాడు!

ఆ ఇన్సిడెంట్ తర్వాత అన్నయ్య నెంబర్ వన్ హీరో అవుతానని ఛాలెంజ్ చేశాడు!


మెగా బ్రదర్ నాగబాబుకి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ప్రేమాభిమానాలో అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నిన్న చిరంజీవి బర్త్ డే సందర్భంగా నాగబాబు చిన్ననాటి జ్ఞాపకాలను.. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘మెగాస్టార్ సక్సెస్ సీక్రెట్స్’ అంటూ మూడు ఎపిసోడ్స్ పోస్ట్ చేసాడు. ‘అన్నయ్య చిన్నప్పటి నుంచి ఎంతో బాధ్యత.. ఎంతో డెడికేషన్ గా ఉండేవాడు. ఆరేళ్ళ వయసులోనే అమ్మ సరుకులు చీటి మీద రాసిస్తే ఎంతో జాగ్రత్తగా తెచ్చేవాడు. అమ్మ చెప్పిన ప్రతీమాటను పాటించేవాడు. ఇంట్లో నేను తప్ప ప్రతీ ఒక్కరూ బాధ్యతతో మెలిగేవారు. నేను చిన్నప్పటి నుంచి బాధ్యతారాహితంగా రెబల్ గా పెరిగాను’ అని నాగబాబు చెప్పుకొచ్చాడు. స్కూల్ కాలేజ్ ఎక్కడికి వెళ్లినా సరే అన్నయ్య అందర్నీ అట్రాక్ట్ చేసేవాడు. ఎంతో మంది అమ్మాయిలు కూడా అన్నయ్య వైపు అలా చూస్తూనే ఉండేవారు. ఎందుకిలా చూస్తున్నారో నాకు ఆ వయసులో అర్థమయ్యేది కాదు. అందుకు నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్య ఓ హీరో అనే ఫీలింగ్ ఉండేదని’ నాగబాబు పేర్కొన్నాడు.

ఇక చిరంజీవికి కూడా మొదట్లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పడానికి చిరు ప్రెండ్ చెప్పిన ఓ విషయాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాడు నాగబాబు. ”మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రజినీకాంత్ ది ఫస్ట్ బ్యాచ్.. చిరంజీవిది చివరి బ్యాచ్. అదే సమయంలో అన్నయ్యతో పాటు సుధాకర్ హరి ప్రసాద్ కలిసి ఉండేవారు. అప్పుడు యాక్టర్ కమ్ డైరెక్టర్ పురాణం సూరి అనే అతను కూడా స్నేహితుడు. అతను ఫ్యామిలీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. పురాణం సూరి ఒకసారి ఓ విషయం చెప్పారు. ఈ విషయం అన్నయ్యకు కూడా తెలీదు. ఓ సారి ఓ పెద్ద స్టార్ హీరో సినిమా ప్రివ్యూ జరుగుతుంటే పురాణం సూరి ఫ్యామిలీతో చిరంజీవి సుధాకర్ హరి ప్రసాద్ వెళ్లారు. అక్కడ థియేటర్ లో ముందు వరుసలో వెళ్లి కూర్చున్నారు. అయితే హీరోకు తెలిసిన వాళ్ళు వచ్చి ముందు వరుసలో కూర్చున్న అన్నయ్యను లేపి.. వెనకాల ఎక్కడో కూర్చోబెట్టారు. అక్కడ అన్నయ్య ఇంసల్ట్ గా ఫీల్ అయినప్పటికీ ఏం మాట్లాడలేదట” అని నాగబాబు చెప్పుకొచ్చారు.

”ఆ సినిమా టాక్ తెలుసుకోవాలని పురాణం సూరి ఫ్యామిలీ ఇంటికి పిలిస్తే సుధాకర్ హరి ప్రసాద్ వెళ్లారు. కానీ అన్నయ్య ఎంతకీ వెళ్లకపోయే సరికి పురాణం సూరి వెళ్లి పిలిచాడట. వెళ్లు వస్తాను.. అని సూరితో చిరాకుగా అన్నారట. సూరి ఇంటికి వెళ్ళాక థియేటర్లో జరిగింది చెప్పారట. అప్పుడు పురాణం సూరి ఫ్యామిలీ వారు అన్నయ్యకి ఓదార్పు మాటలు చెబుతూ.. వాళ్ళు అంతేలే వదిలేయ్ చిరంజీవి.. నువ్వు తప్పకుండా మంచి ఆర్టిస్ట్ వి అవుతావు మాకు తెలుసని అన్నారట. అప్పుడు అన్నయ్య వారితో మాట్లాడుతూ ఇండస్ట్రీకి నేను పెద్ద హీరోను అవ్వాలని వచ్చాను.. కానీ ఇప్పుడు అందరి కంటే నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకుంటున్నాను.. ఎవరైతే ఇలా ఫోజు కొట్టారో వాళ్ళందరిని మించి కొట్టకపోతే చూడండి.. ఎలా సాధించాలో నాకు తెలుసని చెప్పాడట. పురాణం సూరి ఆ రోజు జరిగిన సంఘటన అంతా నాకు చెప్పారు. ఆ రోజు అన్నయ్య ఈ మాటలు అన్నప్పుడు ఎటువంటి గాడ్ ఫాదర్ లేదు.. బ్యాగ్రౌండ్ లేదు. ఏ హీరో కొడుకు కాదు. ఏ హీరో తమ్ముడు కాదు. కనీసం పరిచయస్తులు కూడా లేరు. కేవలం ఆయన పట్టుదల.. ఎలా కష్టపడాలి.. ఎవరితో ఎలా నడుచుకోవాలి అనే వాటితో ఈ స్థాయికి ఎదిగారు. ఆయన అందరికి ఆదర్శం” అంటూ మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు.