Templates by BIGtheme NET
Home >> Cinema News >> Nani – Dasara Teaser: నాని ‘దసరా’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..

Nani – Dasara Teaser: నాని ‘దసరా’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..


Nani | Dasara : నాచురల్ స్టార్ నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ అనే సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. నాచురల్ స్టార్ గత కొన్నేళ్లుగా కోరుకున్న సక్సెస్ మాత్రం రావడం లేదు. శ్యామ్ సింగరాయ్ జస్ట్ అనిపించుకుంది. ఆ తర్వాత ‘అంటే సుందరానికీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. అందుకే ఇపుడు ‘దసరా’ అంటూ తెలంగాణ నేపథ్యంలో ఓ మాస్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నాడు.

రామ్ చరణ్ ‘రంగస్థలం’ మాదిరే ఈ సినిమా కూడా 1980 తెలంగాణ సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీజర్‌ ఈ సోమవారం సాయంత్రం 4.05నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘దసరా’ మూవీతో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంలో నాని ‘సిల్క్‌స్మిత అభిమానిగా కనిపించనున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది.

సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. అది అలా ఉంటే ఈ సినిమా అల్లు అర్జున్ పుష్ప సినిమా లాగా రెండు భాగాలుగా రాబోతున్నట్లు ఓవార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా అలాంటిదేమి లేదని.. సినిమా కేవలం ఒకటే పార్ట్ అంటూ నాని స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో రెండు పార్ట్‌లు అన్న రూమర్‌కు తెరపడింది. ఈ సినిమాలో నాని.. నెవర్ బిఫోర్ రోల్‌లో కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక మరోవైపు ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు బిజినెస్ నాని కెరీర్‌లోని హైయ్యెస్ట్ అని అంటున్నారు. దాదాపు రూ. 45 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం.

ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా దాదాపు రూ. 60 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. నాని కెరీర్‌లో హైయ్యెస్ట్ థియేట్రికల్, నాన్ థియేట్రకల్ బిజినెస్ చేసిన సినిమాగా ‘దసరా’ మూవీ వార్తల్లో నిలిచింది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో పాటు టీజర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్‌లో వస్తాయి.. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే కలెక్షన్స్ విషయంలో కేకపెట్టిస్తుంది అని ట్రేడ్ వర్గాల టాక్. చూడాలి మరి ఎం జరుగుతుందో..

ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

నాని కేవలం సినిమా హీరోగానే కాకుండా నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నాడు. గతేడాది ఈయన నిర్మాణంలో తెరకెక్కిన ‘హిట్2’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇపుడు హీరోగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.