సముద్ర తీరానా నాచురల్ బ్యూటీ

0

తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన హాట్ అండ్ బోల్డ్ హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం అడపా దడపా సినిమాలతో కెరీర్ ను నెట్టుకు వస్తుంది. దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయిన ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ఎంతగా ప్రయత్నించినా కూడా సాధ్యం అవ్వడం లేదు. ఆమె అందుకోసం బోల్డ్ కంటెంట్ మరియు బోల్డ్ పాత్రలను చేసేందుకు కూడా ఓకే చెబుతుంది. అయినా కూడా ఆమెకు ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మడి క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు.

తాజాగా ఈ అమ్మడు సముద్రపు ఒడ్డున కూర్చుని ఒంటరిగా ఏదో తీక్షణంగా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మేకప్ లేకుండా చాలా సింపుల్ గా స్వీట్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమలా పాల్ ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగే అర్హతలు కలిగి ఉందని కాని ఆమెకు పెళ్లి అయ్యి విడాకులు అయిన కారణంగా కొందరు మేకర్స్ ఆమెను సినిమాలకు పట్టించుకోవడం లేదు అంటూ నెటిజన్స్ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నాచురల్ బ్యూటీ ఇప్పుడు కాకున్నా మరికొన్ని రోజులు అయిన తర్వాత అయినా సినిమాలతో బిజీ అవుతుందనే నమ్మకంను ఈ ఫొటోలు చూసిన తర్వాత వ్యక్తం చేస్తున్నారు.