తుపాకితో కాల్చి స్టార్ నటుడి హత్య

0

హాలీవుడ్ నటుడు థామస్ జెఫర్సన్ ను గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో గన్ తో కాల్చి చంపారు. ఆయన మృతికి సంబంధించిన విషయాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. శనివారం జార్జియాలో థామస్ ను దారుణంగా హత్య చేశారంటూ పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు. మర్డర్ వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. థామస్ తుపాకి గాయాలతో పడి ఉన్న విషయం మాకు తెలిసి ఘనట స్థలంకు వెళ్లాము. అప్పటికే థామస్ మృతి చెంది ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిని మరియు చుట్టు పక్కల వారిని ప్రశ్నించగా ఏమీ తెలియదు అన్నట్లుగా స్పందించారు.

థామస్ను వెనుక నుండి తుపాకీతో కాల్చారు. దుండగులు వెనుక నుండి రావడం వల్ల థామస్ గుర్తించలేదని భావిస్తున్నారు. బుల్లెట్ గాయాలకు ఆయన అక్కడికి అక్కడే కుప్పకూలాడు. థామస్ అందరితో బాగా ఉంటాడు. ఎవరితో కూడా గొడవలు పెట్టుకునే మనస్థత్వం కాదు. అదే రోజు ఒక దుకాణంలో షాప్ కీపర్ కు అతడికి చిన్న గొడవ జరిగిందట. ఆ గొడవ వల్లే థామస్ చంపబడ్డాడా అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. అట్లాంటాకు చెందిన ఈ సీనియర్ దిగ్గజ నటుడు ఉన్నత విధ్యను అభ్యసించి నటుడిగా పరిచయం అయ్యాడు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న ఆయన ఇలా మృతి చెందడం పట్ల హాలీవుడ్ వర్గాల వారు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.