బిబి3 కోసం రెడీ అవుతున్న యంగ్ హీరో

0

బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ కరోనా కారణంగా ఏడు నెలల క్రితం ఆగిపోయింది. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా దర్శకుడు హీరోయిన్ మరియు సినిమాలోని కీలకమైన రౌడీ ఎమ్మెల్యే పాత్రకు సంబంధించిన నటీనటుల ఎంపిక విసయంలో తుది చర్చలు జరుపుతున్నాడట. కొన్ని నెలల క్రితమే రౌడీ ఎమ్మెల్యే పాత్ర కోసం అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్రను దర్శకుడు బోయపాటి టీం సంప్రదించారట. ఆ సమయంలో పాత్రకు సుముఖత వ్యక్తం చేసిన నవీన్ చంద్ర అధికారికంగా మాత్రం ఓకే చెప్పలేదట. ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. చర్చలు కూడా జరపక పోవడంతో ఆ చర్చలు మద్యలోనే నిలిచి పోయాయి.

ఇటీవల మరోసారి నవీన్ చంద్రకు స్వయంగా దర్శకుడు బోయపాటి పాత్రను వివరించడంతో ఓకే చెప్పాడట. ఆ పాత్ర కోసం దాదాపు నెల రోజుల పాటు వర్కౌట్ ను చేసేందుకు నవీన్ చంద్ర రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న ప్రాజెక్ట్ లతో పాటు బాలయ్య సినిమాలో కూడా నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది చివరి నుండి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని బోయపాటి టీం నవీన్ చంద్రకు సూచించారట. ఈలోపు చేస్తున్న సినిమాలను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నాడు. అరవింద సమేత సినిమాలో విలన్ పాత్రలో నటించిన కారణంగా మంచి మార్కులు పొందిన నవీన్ చంద్ర మరోసారి ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటాడేమో చూడాలి.