నేషనల్ అవార్డు గెలిచాం.. నీకోసమే సుశాంత్: యువహీరో ట్వీట్

0

బాలీవుడ్ దివంగత యువనటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ నటించిన ‘చిచోరే’ సినిమా.. బెస్ట్ హిందీ ఫిల్మ్ కేటగిరిలో నేషనల్ అవార్డు అందుకుంది. ఈ సందర్బంగా చిచోరే సినిమా గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. అదేవిధంగా ఈ సినిమాలో ఒక్కడైన సుశాంత్ సింగ్ రాజపుత్ గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు సినీప్రముఖులు హీరోలు హీరోయిన్లు. గతేడాది జూన్ నెలలో సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ అలా సడన్ గా ఆత్మహత్య చేసుకోవడంతో అందరి కళ్లు చెమ్మగిల్లాయి. కానీ మంచి మనిషిగా మంచి నటుడుగా సుశాంత్ తనను తాను నిరూపించుకొని వెళ్ళిపోయాడు.

తాజాగా సుశాంత్ నటించిన చిచోరే అవార్డు గెలవడంతో యువనటుడు నవీన్ పొలిశెట్టి ట్విట్టర్ వేదికగా సుశాంత్ ను గుర్తు చేసుకున్నాడు. చిచోరే సినిమాలో సుశాంత్ తో కలిసి నవీన్ కూడా ప్రధానపాత్రలో నటించాడు. అయితే.. ‘ఉత్తమ హిందీ చిత్రంగా చిచోరే జాతీయ పురస్కారం అందుకుంది. అలాగే నేను నటించిన జాతిరత్నాలు సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. నువ్ ఇవన్నీ చూస్తున్నావని నాకు తెలుసు సుశాంత్. ఈ అవార్డు నీకోసమే. మిస్ యూ భాయ్..’ అంటూ నవీన్ ఎమోషనల్ ట్వీట్ చేసాడు. అలాగే అవార్డు గెలిచిన చిత్రబృందానికి.. కంగ్రాట్స్ నితీష్ సార్.. తన తోటి నటులకు కూడా విషెస్ చేసాడు. చిచోరే సినిమాలో నవీన్ ఆసిడ్ అనే పాత్రలో నటించాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నవీన్ టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయాడు. చూడాలి మరి త్వరలో సినిమా విశేషాలు బయటపెడతాడేమో!