ఎన్టీఆర్30 హీరోయిన్ ఫిక్స్ అయినట్లే.. ఇదే సాక్ష్యం

0

ఎన్టీఆర్.. త్రివిక్రమ్ ల మూవీ ప్రకటన వచ్చి ఏడాది దాటింది. గత ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన వెంటనే ఎన్టీఆర్30 సినిమాను త్రివిక్రమ్ ప్రకటించాడు. కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ ఆలస్యం అవుతున్న కారణంగా ఎన్టీఆర్30 ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. ఏడాది కాలంగా ఈ సినిమా హీరోయిన్ గురించి చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా హీరోయిన్ ను రష్మిక మందన్నా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

రెండు రోజుల క్రితం చిత్ర నిర్మాణ ఆఫీస్ లో త్రివిక్రమ్ ను రష్మిక మందన్నా కలిసిందట. ఆ సమయంలో రష్మికకు కథను వినిపించాడనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి విషయాన్ని క్లారిటీ ఇవ్వలేదు. కాని ఎన్టీఆర్ కు జోడీగా రష్మిక కన్ఫర్మ్ అయ్యిందని అంటున్నారు. రష్మిక కు త్రివిక్రమ్ కథ వినిపించడంతో పాటు ఆమె ఫొటో షూట్ కూడా చేయించారనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఎన్టీఆర్ 30 మూవీలో రష్మిక కన్ఫర్మ్ అయ్యిందని అంటున్నారు. వచ్చే నెలలో సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. కనుక ఆ సమయంలో హీరోయిన్ విషయమై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.