నయన్ సీక్రెట్ మ్యారేజ్ నిజమా? ఏంటీ కన్ఫ్యూజన్!

0

నయనతార ఏం చేసినా సెన్సేషనే. కోలీవుడ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న నయన్ కి నంబర్ వన్ పారితోషికం అందుకుంటున్న తారగా గుర్తింపు ఉంది. నయన్ తెరపై కనిపిస్తే చాలు కాసుల వర్షం కురుస్తుందని ఆమె డేట్స్ కోసం పడిగాపులు పడే దర్శకనిర్మాతలు వున్నారంటే అతిశయోక్తి కాదు. నయనతార నటించిన తాజా చిత్రం `అమ్మోరు తల్లి` మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ రేటింగుల్లో టాప్ ట్రెండింగ్ లో వుంది.

ఆర్.జె. బాలాజీ నటించి తెరకెక్కించిన చిత్రమిది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి ఫీడ్ బ్యాక్ లభిస్తోంది. ఇదిలా వుంటే తాజాగా నయనతార మళ్లీ వార్తల్లో నిలిచింది. నయనతార పెళ్లి కూతురు గెటప్ లో దర్శన మిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ఈ ఫొటోలు చూసిన కోలీవుడ్ మీడియా అంతా విగ్నేష్ శివన్ – నయనతార రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ప్రాచారం చేస్తున్నారు. అయితే ఈ ఫొటో వెనకున్న అసలు కారణం వేరే వుందని తెలిసింది. నయన్ వివాహానికి సంబంధించిన ఫోటో ఇది కాదని ఓ యాడ్ ఫిల్మ్ కోసం నయనతార పెళ్లి కూతురు గెటప్ లో కనిపించిందట. గత కొంత కాలంగా నయనతార విగ్నేష్ శివన్ డేటింగ్ లో వున్నారు. అది బోర్ కొట్టినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటారట.