బిబి4 : ఏంటి దివి ఉన్నావా? లేవా?

0

ఈసారి బిగ్ బాస్ లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారు అంతా కూడా ఎప్పుడు చూడని ఫేస్ లే. చాలా మందికి వారు ఎవరు అసలు వారు ఏ రంగానికి చెందిన వారు అనే విషయాలు కూడా తెలియదు. అయినా కూడా బిగ్ బాస్ వారిని ఎంపిక చేశాడు అంటే ఏదో కారణం అయితే ఉండి ఉంటుందని బిబి అభిమానులు వారి నుండి ఎంటర్ టైన్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొందరు కావాలని కెమెరాకు ఫోకస్ అవుతుంటే మరికొందరు మాత్రం అస్సలు ఫోకస్ లోకి రావడం లేదు. కెమెరా ఫోకస్ లోకి ఎక్కువగా వస్తున్న అమ్మాయిల విషయానికి వస్తే సుజాత.. లాస్య.. హారికలు మాత్రమే. ఇతరులు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. కాని దివి మాత్రం అస్సలు కెమెరా ఫోకస్ లో ఉండటం లేదు.

ఇంటి సభ్యులతో బాగానే ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. కాని ఆమె ఇప్పటి వరకు ఏ ఒక్క విషయంలో మాట్లాడటం కాని కాస్త వాయిస్ రేజ్ చేయడం కాని చేయలేదు. ఏం జరుగుతున్నా అక్కడ అయితే ఉంటుంది. ఆమె గేమ్ ప్లాన్ అయ్యి ఉంటుందా లేదంటే మరేంటో కాని ఇప్పటి వరకు ఆమె నుండి మంచి ఫుటేజ్ ను ప్రేక్షకులు చూడలేదు. ఎంట్రీ సమయంలో తెగ హడావుడి చేసి అందాలతో అలరించడం ఖాయం అనిపించింది. కాని తీరా చూస్తే ఇప్పటి వరకు కెమెరా ఫోకస్ లోకి రాకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి వారంలోనే ఎలిమినేషన్ కు ఆమె వచ్చింది కనుక జాగ్రత్తగా ఉంటుందా అని కొందరు అంటున్నారు. జాగ్రత్త పేరుతో ఆమె యాక్టివ్ గా ఉండకుంటే ఓట్లు ఎలా పడుతాయి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వారంలో ఆమె సేఫ్ అయితే తదుపరి వారాల్లో అయినా ఆమె సందడి ఉంటుందేమో చూడాలి.