Templates by BIGtheme NET
Home >> Cinema News >> జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.. మారే 10 అంశాలు ఇవే

జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.. మారే 10 అంశాలు ఇవే


కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త మార్పులు చూడబోతున్నాం. జనవరి 1 నుంచే ఆ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇందులో వాహనాలకు సంబంధించి కొన్ని కాగా.. బ్యాంకింగ్ టెలికాం రంగాలకు చెందినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.

జనవరి 1 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు (టూ త్రీవీలర్ మినహా) కేంద్రం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే.. నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పని ఉందని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. 2021 ఏప్రిల్ 1 నుంచి కొత్త థర్డ్ పార్టీ వాహన బీమా పొందటానికీ ఫాస్టాగ్ను తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్కు సంబంధించిన సహాయం కోసం 1033 నంబర్ను సంప్రదించవచ్చు.

ఇప్పటివరకు కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా కేవలం రూ.2 వేలు మాత్రమే పిన్ ఎంటర్ చేయకుండా పేమెంట్ చేసే వీలుంది. కొత్త సంవత్సరం నుంచి మొదటి రోజు నుంచి రూ.5 వేల వరకు లావాదేవీలు జరపొచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఎన్ఎఫ్సీ ద్వారా ఈ కార్డులు పనిచేస్తాయి.

చెక్ సంబంధిత మోసాలను నిలువరించే లక్ష్యంతో ‘పాజిటివ్’ పే విధానాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. ఈ విధానం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటివరకు చెక్ దానిపై ఖాతాదారుని సంతకం ఉంటే చెక్ మంజూరు చేస్తున్నాయి. తాజా విధానంతో రూ.50 వేలు అంతకంటే ఎక్కువ మొత్తంలో జారీ చేసిన చెక్కులను పునః సమీక్షించాల్సి ఉంటుంది. అయితే.. 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం కలిగిన చెక్కులపై సమీక్ష తప్పనిసరి.

కొత్త ఏడాది మొదటి రోజు నుంచి వాట్సాప్ కొన్ని ఫోన్లలో పనిచేయదు. ఐఫోన్లలో ఐవోఎస్ 9 ఆండ్రాయిడ్ ఫోన్లలో 4.0.3 ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా ముందువి ఉంటే వాటిలో మాత్రం వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుంది. ఐవోఎస్ 9 అంటే ఐఫోన్ 4 దానికన్నా ముందు వచ్చిన మోడళ్లలో వాట్సాప్ పనిచేయదు.

న్యూ ఇయర్లో కొత్త బైక్ లేదా కారు కొనాలనుకునే వారికి వాహన కంపెనీలు షాక్ ఇచ్చాయి. ముడిసరుకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని.. అందుకే జనవరి 1 నుంచి వాహనాల ధరలు పెంచుతున్నామని పలు వాహన తయారీ కంపెనీలు ప్రకటించాయి. మారుతీ సుజుకీ ఎంజీ మోటార్ ఇండియా మహీంద్రా అండ్ మహీంద్రా రెనోతోపాటు హీరో మోటోకార్ప్ సైతం ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి. ఫ్రిజ్ టీవీ వాషింగ్ మిషిన్ల రేట్లు కూడా పెరుగనున్నాయి.

చిన్నవ్యాపారులకు 42వ జీఎస్టీ కౌన్సిల్ ఊరట ఇచ్చింది. రూ.5 కోట్లలోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు జనవరి 1 నుంచి త్రైమాసికానికి ఒకసారి రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుంది. దీనివల్ల 94 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

ఇకపై ల్యాండ్లైన్ నుంచి మొబైల్కు చేయబోయే కాల్స్కు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ‘0’ను తప్పనిసరి చేసింది. జనవరి 15 నుంచి ఈవిధానం అమల్లోకి రానుంది. దీనివల్ల 2539 సంఖ్య శ్రేణులు అందుబాటులోకి రానున్నాయి.