Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఈ బ్యూటీ ఆర్మీ ఉద్యోగి.. కానీ ఆమెకు అందమే మైనసయ్యింది!

ఈ బ్యూటీ ఆర్మీ ఉద్యోగి.. కానీ ఆమెకు అందమే మైనసయ్యింది!


సైన్యంలో అమ్మాయిలు పనిచేయడం మనదేశంలో కొంత తక్కువే. కానీ విదేశాల్లో అది కామనే. అలాగే రష్యాలోనూ అన్నా ఖ్రమత్సోవా అనే ఓ అమ్మాయి సైన్యంలో చేరింది. మామూలుగా అయితే ఆమె విషయం ఎవరూ చర్చించుకొనేవారు కాదు. కానీ ఆమె గొప్ప అందగత్తె. సినిమాస్టార్లను మోడళ్లను సైతం మైమరిపించే అందం ఆమెది. అంత అందమైన అమ్మాయి సైన్యంలో చేరితే పరిస్థితి ఏమిటి? అక్కడున్న మిగతా ఉద్యోగులు తమ పనులు చేసుకోగలరా? ఆమెనే చూస్తూ ఉండిపోరా? చివరకు రష్యా సైనికాధికారులు ఏమన్నాకున్నారో తెలియదు కానీ.. ఆమెను ఉద్యోగం లో నుంచి తీసేశారు. అయితే ఈ విషయంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ‘అందంగా పుట్టడమే నేను చేసిన నేరమా? నేను బికిని వేసుకున్నానని నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారా. ఇదెక్కడి న్యాయం. నేను అందంగా ఉండటం రష్యా సైనికాధికారులకు నచ్చలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు కూడా నచ్చలేదు. అందుకే నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు’ అంటూ ఆమె రష్యా సైనికాధికారులపై నిప్పులు చెరిగారు.

అయితే ఇటీవల అన్నా ఖ్రమత్సోవా అందాల పోటీలో పాల్గొని విజయం సాధించారు. అందువల్లే ఆమెను ఉద్యోగం నుంచి తీసేసి ఉంటారని కూడా వార్తలు వచ్చాయి. అన్నా తల్లిదండ్రులు కూడా సైనికాధికారులే. ఆమె రష్యా నేషనల్ గార్డ్స్ లో సైనికురాలిగా ఎంపికయ్యింది. కానీ ఆమె చివరకు ఉద్యోగం కోల్పోయింది. తాను బికినీ ధరించడం వల్లే ఉద్యోగం నుంచి తీసేశారని అన్నా చెబుతుండగా.. సైనికాధికారుల వాదన మరోలా ఉంది. ‘అమె అందంగా ఉందని.. ఆమె అందాల పోటీలో పాల్గొన్నదని.. బికినీ వేసుకుందని ఉద్యోగంలోంచి తీసేయలేదు.
ఇటీవల అన్నా ఖ్రమత్సోవా ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఈ వీడియో రష్యా సైనిక కార్యకలాపాలకు చెందిన ఓ రహస్య ప్రదేశంలో ఆమె చిత్రీకరించింది. ఈ వీడియోను పోస్ట్ చేయడం నేరం. ఇది దేశ భద్రతకే ప్రమాదం. అందుకే ఆమెను ఈ ఉద్యోగం లోంచి తీసేశాం. ఆమె చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు’ అంటూ రష్యా సైనికాధికారులు ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అన్నా ఫొటోలు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సైనికులు ఇంత అందంగా ఉంటారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.