సౌత్ ప్రేక్షకుల కోసమే ఈ అందాల నిధి

0

సౌత్ హీరోయిన్స్ కు నార్త్ నుండి ఆఫర్లు వస్తే ఎగురుకుంటూ వెళ్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. హిందీ సినిమాల మార్కెట్ ఎక్కువ. ఇక్కడ రెండు మూడు సినిమాలతో వచ్చే పేరు అక్కడ కేవలం ఒక్క సినిమాతోనే వస్తుంది. అందుకే ఎక్కువ శాతం బాలీవుడ్ వైపు చూస్తూ ఉంటారు. కాని అందాల నిధి అగర్వాల్ మాత్రం బాలీవుడ్ లో కంటే సౌత్ సినిమాల్లోనే ఎక్కువగా నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. బాలీవుడ్ లో చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నా కూడా ఆమె కాదన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈ అమ్మడు ఇస్మార్ట్ బ్యూటీగా మారిపోయింది. తెలుగు మరియు తమిళంలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఈమెకు చేతిలో ఉన్నాయి.

ఇదే సమయంలో ఈమెకు మరికొన్ని ఆఫర్లు కూడా వచ్చేవి ఉన్నాయి. కరోనా కారణంగా ఆ ప్రాజెక్ట్ లు కాస్త ఆలస్యం అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే మరిన్ని ఆఫర్లు ఈమె తలుపు తట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ అమ్మడు తన బ్యూటీని కేవలం సౌత్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం చేయాలని భావిస్తుంది. బాలీవుడ్ నుండి వచ్చే ఆఫర్లను కూడా కాదని ఈమె ఇక్కడ పాగా వేయాలని భావిస్తుంది. ఇక్కడ కొన్నాళ్లు సినిమాలు చేసిన తర్వాత అయినా బాలీవుడ్ వైపు ఈమె చూస్తుందేమో. ప్రస్తుతానికి అయితే పూర్తిగా సౌత్ సినిమాలపైనే ఈమె దృష్టి ఉంది.