యాడ్ షూట్ కోసం నితిన్ కూల్ అండ్ స్టైలిష్ లుక్…!

0

టాలీవుడ్ హీరోలు సినిమాల్లో నటిస్తూ పలు బ్రాండ్స్ కి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకు అందరూ ఏదొక బ్రాండ్ కి అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున – వెంకటేష్ – మహేష్ బాబు – రామ్ చరణ్ – ఎన్టీఆర్ – ప్రభాస్ – అల్లు అర్జున్ – అఖిల్ – నాగచైతన్య – నాని – సుశాంత్ వంటి హీరోలు ఇప్పటికే పలు బ్రాండ్స్ కి ప్రచారకర్తలుగా ఉన్నారు. ఇటీవల యువ హీరో రామ్ పోతినేని కూడా ఓ టాప్ బ్రాండ్ కోసం యాడ్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూత్ స్టార్ నితిన్ కూడా ఓ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం సైన్ చేసారని తెలుస్తోంది. తాజాగా దీని కోసం హైదరాబాద్ లో జరిపిన ఓ యాడ్ షూట్ లో నితిన్ పాల్గొన్నాడు. ఇది నితిన్ కి మొదటి కార్పొరేట్ బ్రాండ్ ఎండార్స్మెంట్ అని చెప్పవచ్చు.

కాగా నితిన్ ఈ యాడ్ షూట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఏదేమైనా అందరికి 2020 ఏడాది గుర్తుండి పోయినట్లే నితిన్ కి కూడా మెమరబుల్ ఇయర్ గా నిలిచిపోనుంది. ఎందుకంటే నితిన్ ఈ ఏడాది ప్రారంభంలో ‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలానే తన ప్రియసఖి షాలిని ని వివాహం చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు. ఇప్పుడు ఫస్ట్ కమర్షియల్ బ్రాండ్ కి సైన్ చేసి ఎండార్స్మెంట్ల మార్కెట్ ను కూడా విస్తరించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా నితిన్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ వస్తున్నాడు. ఇటీవలే ‘రంగ్ దే’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడు. త్వరలోనే మేకర్లపాటి గాంధీ దర్శకత్వంలో ‘అంధాదున్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేయనున్నాడు. వీటితో పాటు చంద్రశేఖర్ ఏలేటితో ‘చెక్’ మరియు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమాలు చేయనున్నాడు.